Prabhas Heroine : ప్రభాస్ హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది… లేటెస్ట్ లుక్ చూస్తే షాక్ అవుతారు!

Prabhas Heroine : 2022 లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది తాజాగా కన్నడ స్టార్ హీరో అరెస్ట్ పై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

Written By: NARESH, Updated On : June 14, 2024 8:34 pm

Prabhas Heroine Sanjana Galrani's latest look is viral

Follow us on

Prabhas Heroine : కొందరు హీరోయిన్లు నాలుగైదు సినిమాల్లో నటించి ఆ తర్వాత కనిపించకుండా పోతారు. అందం, అభినయం ఉన్నప్పటికీ అవకాశాలు కరువై పరిశ్రమకు దూరమవుతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా ఆ లిస్ట్ లో ఒకరు. ఈ కన్నడ భామ తెలుగులో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ప్రభాస్ సినిమాతో పాప్యులర్ అయ్యింది. నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఒక వివాదంలో చిక్కుకోవడంతో ఆమె కెరీర్ నాశనమైంది.

ఆ తర్వాత పెళ్లి చేసుకుని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. సదరు ఫోటోలో ఉన్న ఒకప్పటి హీరోయిన్ ఎవరో కాదు… సంజన గల్రాని. 15 ఏళ్ల వయసులో హీరోయిన్ గా కన్నడ పరిశ్రమలో అడుగు పెట్టింది. 2005లో సోగ్గాడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ బుజ్జిగాడు ‘ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. త్రిష చెల్లెలుగా అమాయకపు అమ్మాయిగా కనిపించింది సంజన గల్రాని.

బుజ్జిగాడు ఓ మోస్తరు విజయం సాధించగా సంజన గల్రాని తెలుగు ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ముగ్గురు, యమహో యమ, లవ్ యూ బంగారం, సర్దార్ గబ్బర్ సింగ్, అవును 2 వంటి సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 45 సినిమాల్లో హీరోయిన్ గా సంజన గల్రాని నటించారు. శాండిల్ వుడ్ డ్రగ్ మాఫియాలో సంజన గల్రాని పేరు ప్రముఖంగా వినిపించింది. అరెస్ట్ అయిన సంజన గల్రాని మూడు నెలలు జైల్లో ఉంది. ఇక 2020 లాక్ డౌన్ టైం లో ఓ డాక్టర్ ని పెళ్లాడింది.

2022 లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది తాజాగా కన్నడ స్టార్ హీరో అరెస్ట్ పై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆమె లుక్ చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె వీడియో లో మాట్లాడుతూ .. దర్శన్ అరెస్ట్ నిజంగా షాకింగ్ గా అనిపించింది. ఆందోళన చెందాను .. అతను అరెస్ట్ కాకూడదని దేవుణ్ణి ప్రార్ధించాను. ఇది నిజంగా దిగ్భ్రాంతికర పరిణామం అని సంజన గల్రాని అన్నారు.