https://oktelugu.com/

G7 Summit : ఇటలీ ప్రధాని.. ఇండియా ‘నమస్తే’.. వీడియో వైరల్

జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్లను మెలోనీ సంప్రదాయ భారతీయ పలకరింపు ‘నమస్తే’తో పలకరించడం ఈ వీడియోల్లో కనిపించింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 14, 2024 / 07:46 PM IST

    The video of Italian Prime Minister 'Namaste' like India

    Follow us on

    G7 Summit : ప్రపంచానికే గురువు స్థానంలో ఉండే అర్హత ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క భారత్ మాత్రమే. 200 సంవత్సరాలు పాలించినా బ్రిటీష్ సంప్రదాయాలను మాత్రం దేశం అలవాటు చేసుకోలేదు. ఇప్పటికీ తమ వారసత్వంగా వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలను మాత్రమే భారత్ పాటిస్తూ వస్తుంది. విదేశాల్లా చేతులు జోడించే సంప్రదాయం భారత్ కు లేదు. ఇది మంచిది కాదని సంస్కారంతో కూడిన నమస్కారమే మంచిదని చాటింది భారత్. కరోనా సమయంలో ఇలా పలకరించుకోవడం అన్ని దేశాలు అలవాటు చేసుకున్నాయి.

    ఇటలీలో జీ7 (G7) శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని కూటమిలో ఉన్న దేశాల అధ్యక్షులు, పీఎంలు, ముఖ్యమైన ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. జీ7లో భారత్ లేకున్నా పెద్దన్న పాత్ర పోషించాలని మోడీని ఆహ్వానించారు. అయితే ఇక్కడ మెలోని జీ7 దేశాల అధినేతలను పలకరించిన విధానంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆమె వారిని భారతీయ సంస్కృతిక పలకరింపు అయిన ‘నమస్తే’తో స్వాగతం తెలిపింది. దీంతో ఈ వీడియో ఇప్పుడ సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు, ముఖ్యంగా భారతీయులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్లను మెలోనీ సంప్రదాయ భారతీయ పలకరింపు ‘నమస్తే’తో పలకరించడం ఈ వీడియోల్లో కనిపించింది. దక్షిణ ఇటలీలోని అపులియా నగరంలోని బోర్గో ఎగ్నాజియా (ఫసానో)లో జూన్ 13 నుంచి జూన్ 15 వరకు 50వ జీ7 సదస్సు జరగనుంది. ఇందులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. జీ7లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ దేశాలు ఉన్నాయి.

    తొలిరోజు సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, యూకే ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో పాటు ఇటలీ ప్రధాని గియార్జియా మెలోని పాల్గొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తన దేశంపై రష్యా ఆక్రమణపై ఒక సెషన్ కు షెడ్యూల్ చేశారు.

    2024 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీయే విజయం తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోడీ గురువారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) ఇటలీకి చేరుకున్నారు. శుక్రవారం జరిగే జీ7 సదస్సులో మోడీ పాల్గొంటారు. ఆయనతో పాటు అల్జీరియా, అర్జెంటీనా, బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, మౌరిటానియా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, ట్యునీషియా, టర్కీ దేశాధినేతలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. మెలోనీ సహా ప్రపంచ నాయకులతో వివిధ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్లతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆయన జెలెన్స్కీతో కూడా సంభాషిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి, కానీ ఇంకా ధృవీకరించబడలేదు.