Pawan Kalyan: పాకిస్తాన్ లో దుమ్ములేపే వసూళ్లు రాబట్టిన పవన్ కళ్యాణ్ సినిమా ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'కాటమరాయుడు' చిత్రం ఇక్కడ కమర్షియల్ గా యావరేజి రేంజ్ లో ఆడింది. కానీ ఈ సినిమాని హిందీ లోకి దబ్ చేసి యూట్యూబ్ లోకి వదిలితే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

Written By: Vicky, Updated On : August 28, 2024 7:10 pm

Pawan Kalyan(1)

Follow us on

Pawan Kalyan: మన తెలుగు సినిమాకి ప్రస్తుతం పాన్ ఇండియా ని దాటి పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు లభించింది. ‘మగధీర’ చిత్రం నుండి మొదలైన ఈ గుర్తింపు, ‘బాహుబలి’ సిరీస్ తర్వాత తారాస్థాయికి చేరుకుంది. ఇక #RRR చిత్రం తో అయితే హాలీవుడ్ స్థాయికి చేరుకొని ఆస్కార్ అవార్డు ని గెలుచుకునే రేంజ్ కి మన తెలుగు సినిమా ఎదిగింది. మన స్టార్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు దక్కించుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు తక్కువ అని కొంతమంది అంటుంటారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ట్రేడ్ పండితుల వాదన. పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువగా చెయ్యడం వల్ల, ఆయన చిత్రాలకు ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందే అవకాశం తగ్గింది కానీ, మొదటి నుండి ఆయన ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించిన హీరో అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అందుకు ఉదాహరణగా ఇప్పటి వరకు ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘కాటమరాయుడు’ చిత్రం ఇక్కడ కమర్షియల్ గా యావరేజి రేంజ్ లో ఆడింది. కానీ ఈ సినిమాని హిందీ లోకి దబ్ చేసి యూట్యూబ్ లోకి వదిలితే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ చిత్రం హిందీ థియేట్రికల్ వెర్షన్ బాంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో విడుదలైంది. ఆ దేశాల్లో ఈ సినిమాకి ఊహించని స్థాయి రెస్పాన్స్ వచ్చిందట. పాకిస్తాన్ దేశంలో ఈ చిత్రానికి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, బాంగ్లాదేశ్ లో ఈ చిత్రానికి 14 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ కి ఇతర దేశాల్లో ఎలాంటి గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు.

పవన్ కళ్యాణ్ సరైన పాన్ ఇండియన్ చిత్రం చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క రికార్డు కూడా మిగలదని, అలాంటి సినిమానే ఓజీ అని, ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ క్రేజ్ ని తక్కువ అంచనా వేసిన ప్రతీ ఒక్కరికి షాక్ తగులుతుందని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో అంటున్నారు. ఇది ఇలా ఉందా ఓజీ చిత్రానికి మార్కెట్ లో ఏ స్థాయి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అభిమానులు ఓజీ అనే పేరు తీస్తేనే పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల తాత్కాలికంగా షూటింగ్ వాయిదా పడింది. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ ఏడాదిలోపు షూటింగ్ ని పూర్తి చేసి, మార్చి 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.