Mass Movie Re Release: నాగార్జున ‘మాస్’ రీ రిలీజ్ కి ఘోరమైన వసూళ్లు.. N కన్వెన్షన్ ఘటన ప్రభావం గట్టిగానే పడింది!

కొత్త సినిమాలకు వసూళ్లు ఉండడం లేదు, అలాగే పాత సినిమాల రీ రిలీజ్ లకు కూడా వసూళ్లు ఉండడం లేదు. మన్మధుడు రీ రిలీజ్ కి పర్వాలేదు అనే రేంజ్ లో వసూళ్లు వచ్చాయి కానీ, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మాస్ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

Written By: Vicky, Updated On : August 28, 2024 7:03 pm

Mass Movie Re Release

Follow us on

Mass Movie Re Release: టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంతమంది హీరోలకు అయితే వాళ్ళ కొత్త సినిమాలకు వచ్చే వసూళ్ల కంటే, పాత సినిమాల రీ రిలీజ్ లకు వచ్చే వసూళ్లే ఎక్కువగా ఉంటున్నాయి. ఉదాహరణకి మాస్ మహారాజ రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ చిత్రం నెల రోజుల క్రితం రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. కొన్ని ప్రాంతాలలో అయితే ఈ సినిమాకి వచ్చినంత వసూళ్లు రీసెంట్ గా విడుదలైన రవితేజ కొత్త సినిమా ‘మిస్టర్ బచ్చన్’ కి కూడా రాలేదు. రీ రిలీజ్ ట్రెండ్ ఆ స్థాయిలో కొనసాగుతుంది. కానీ అక్కినేని నాగార్జున విషయంలో ఇది పూర్తిగా రివర్స్ అయ్యింది.

ఈమధ్య ఆయన కొత్త సినిమాలకు వసూళ్లు ఉండడం లేదు, అలాగే పాత సినిమాల రీ రిలీజ్ లకు కూడా వసూళ్లు ఉండడం లేదు. మన్మధుడు రీ రిలీజ్ కి పర్వాలేదు అనే రేంజ్ లో వసూళ్లు వచ్చాయి కానీ, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మాస్ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. హైదరాబాద్ లో ఈ సినిమాకి ఉన్న తక్కువ డిమాండ్ ని బట్టి కేవలం 6 షోస్ మాత్రమే వెయ్యగా వాటి నుండి కేవలం 4 లక్షల 50 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన గ్రాస్ వసూళ్లను లెక్క గడితే కేవలం 9 లక్షల రూపాయిల మాత్రమే వచ్చాయి. అలాగే కర్ణాటక నుండి లక్ష రూపాయిల గ్రాస్ రాగా, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఇది రీ రిలీజ్ హిస్టరీ లోనే ఘోరమైన రికార్డు గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మాస్ చిత్రం నాగార్జున కెరీర్ లోనే ది బెస్ట్ చిత్రాలలో ఒకటిగా చెప్పుకుంటారు ఆయన అభిమానులు.

ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ సన్నివేశాలు, సెంటిమెంట్ ఇలా అన్ని అద్భుతంగా కుదిరాయి. ఫలితంగా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచి సుమారుగా 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి హిట్ చిత్రం రీ రిలీజ్ కి ఇంత తక్కువ వసూళ్లు రావడం అక్కినేని అభిమానులకు బాధ కలిగించే విషయం. అయితే నాగార్జున ప్రస్తుతం N కన్వెన్షన్ అక్రమ నిర్మాణం పై ఆరోపణలు ఎదురుకుంటున్నారు. అక్కినేని అభిమానులు కూడా ఇంకా ఆ మూడ్ నుండి బయటకి రాలేదు. అందుకే ఈ సినిమా రీ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చెయ్యలేదని, లేకపోతే క చ్చితంగా సీనియర్ హీరోలలో రికార్డు పెట్టే రేంజ్ వసూళ్లను ఈ చిత్రానికి అందించేవాళ్ళం అని అక్కినేని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 నుండి స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కానుంది.