Age gap between Allu Arjun and his wife
Allu Arjun: ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే జంటలలో అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరి పెళ్లి జరిగి ఇప్పటికే 10 సంవత్సరాలు అవుతున్నా వీరి మీద ఇప్పటికీ నెగిటివ్ టాక్ రాలేదు. అయితే ఈ స్టార్ హీరో తన నటనతో ఎంతో మందిని మెస్మరైజ్ చేస్తూ ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. ఇటీవల అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని మేడం టుసాడ్స్ లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు దంపతులు ఇద్దరు కలిసి వెళ్లారు.
ఎలాంటి ఈవెంట్ జరిగిన ఇద్దరు కలిసి వెళ్తుంటారు. అంతే కాదు బన్నీ ప్రతి సినిమాను భార్య ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేకాదు ఆయన సినిమాలకు ప్రమోషన్స్ కూడా చేస్తుంటుంది స్నేహ రెడ్డి. కానీ వీరి పిల్లలకు సంబంధించిన వీడియోల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటుంది బన్నీ భార్య. అయితే వీరిద్దరిది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. ఒక పార్టీలో కలిసిన వీరిద్దరు స్నేహితులుగా కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరు.
మరి ఈ జంట మధ్య ఏజ్ గ్యాప్ ఎంతనో తెలుసా? అల్లు అర్జున్ ఏప్రిల్ 8న 1982లో పుట్టారు. ఇక స్నేహ రెడ్డి సెప్టెంబర్ 29న 1985లో పుట్టారట. అంటే ఈ జంట మధ్య దాదాపు గా మూడు సంవత్సరాల గ్యాప్ ఉంది. అయితే భార్యాభర్తల మధ్య ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండకూడదు అంటారు నిపుణులు. అలా ఉంటే ఆలోచనలు వేరుగా ఉండి ఆ జంట సంతోషంగా ఉండరు అని కూడా చెబుతారు. ఇక వీరిద్దరు సంతోషంగా ఉండడానికి ఈ ఏజ్ గ్యాప్ కూడా కారణం అంటారు కొందరు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2తో పుల్ బిజీగా ఉన్నారు.
పుష్ప సృష్టించిన ప్రభంజనం వల్ల పుష్ప 2 కూడా ఎన్నో భాషల్లో రిలీజ్ కు సిద్దమైంది. ఈ సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా. అయితే పుష్ప కు మూడవ పార్ట్ కూడా ఉండబోతుంది అని సమాచారం. మరి సినిమా విడుదల అయితే గానీ దీనిపై క్లారిటీ రాదు. మొత్తం మీద ఇలా సినిమాలతో ప్రభంజనాలు సృష్టించే అల్లు అర్జున్ ఆయన భార్యకు జస్ట్ 3 సంవత్సరాల గ్యాప్ మాత్రమే ఉందన్నమాట.