Ramya Krishnan: ఆ నటుడి సరసన రమ్య కృష్ణ కూతురు, చెల్లి, భార్యగా నటించిందా? ఇంతకీ ఎవరాయన?

భలే మిత్రులు సినిమా ద్వారా 1985లో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది రమ్య కృష్ణ. అయితే ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే ఐరన్ లేడీగా ఎంతో మంది నుంచి విమర్శలను అందుకుంది రమ్య.

Written By: Swathi, Updated On : March 30, 2024 11:28 am

Ramya Krishnan

Follow us on

Ramya Krishnan: రమ్య గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఎన్నో క్యారెక్టర్లతో ప్రేక్షకులను అభిమానులను చేసుకుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఇప్పటికి కూడా తన రేంజ్ ను పెంచుకుంది ఈ నటి. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో పాత్రల్లో నటించిన రమ్య కృష్ణ ప్రస్తుతం మెయిన్ లీడ్ పాత్రల్లో నటిస్తోంది. అయితే ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్తను తెలుసుకుందాం.

భలే మిత్రులు సినిమా ద్వారా 1985లో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది రమ్య కృష్ణ. అయితే ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే ఐరన్ లేడీగా ఎంతో మంది నుంచి విమర్శలను అందుకుంది రమ్య. ఫెయిల్యూర్ లతో బాధ పడుతున్న ఈ నటి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన అల్లుడు గారు సినిమాతో కెరీర్ ను మలుపు తిప్పుకుంది. ఈ సినిమాలో తన నటనకు ఫుల్ మార్కులు పడటమే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. దీంతో ఈ సినిమా తర్వాత కూడా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లోనే నటించింది.

కుటుంబం, ప్రేమ, వంటి పాత్రల్లో మాత్రమే కాదు దేవుళ్లకు సంబంధించిన సినిమాల్లో నటిస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంది రమ్య కృష్ణ. విలన్ గా, నెగిటివ్ రోల్ లోనూ మెప్పించడంలో ఈమెకు సాటి ఎవరు రారు అనే రేంజ్ లో తన నటనను నిరూపించుకుంది. అయితే ఈమె సినీ కెరీర్ లో ఓ వింత ఏంటంటే.. ఓకే నటుడికి చాలా పాత్రల్లో నటించింది. మరి ఆ నటుడు ఎవరు అనుకుంటున్నారా? మంచి పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రలను కూడా పోషించిన నాజర్.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా గురించి పరిచయం అవసరం లేదు. అయితే ఇందులో శివగామి పాత్రలో రమ్య కృష్ణ నటిస్తే.. బిజ్జల దేవుడిగా నాజర్ నటించారు. ఇందులో రమ్య కృష్ణ భర్త పాత్రను పోషించారు ఈ నటుడు. రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహలో రమ్య కృష్ణకు నాజర్ అన్న పాత్రలో నటించారు. ఈయనకు రమ్య కృష్ణ వంత రాజవతాన్ వరువేన్ అనే తమిళ సినిమాలో కూతురి పాత్రలో నటించింది. ఇలా నాజర్ కు కూతురు, చెల్లి, భార్య పాత్రలను పోషించింది రమ్య కృష్ణ.