Rajamouli , Mahesh Babu
Rajamouli and Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకునే ముందుకు సాగుతున్నారు మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి లాంటి దర్శకుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఆరని ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో భారీ సినిమాని చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్ళ కాంబినేషన్ లో రాబోతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కడం మరొక విశేషమనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ కసరత్తులను చేస్తున్న రాజమౌళి ఈ సినిమాతో మరోసారి పాన్ వరల్డ్ లో ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా భారీ లెవెల్లో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక్కసారి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే తన పేరు వరల్డ్ వైడ్ గా మారుమ్రోగిపోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా సంపాదించుకున్న వాడవుతాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఈ సినిమా కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమా కోసం దాదాపు 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే టాక్ అయితే వినిపించింది. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం దాదాపు 500 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది.
మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాను భారీ సక్సెస్ గా నిలిపితే మాత్రం ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ కూడా 1300 కోట్ల వరకు అవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మొత్తానికైతే విజువల్ వండర్ గా తెరకెక్కించి అంతకు డబుల్ రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టాలనే లక్ష్యంతో రాజమౌళి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఇద్దరు హీరోలు ఉన్నప్పటికి ఆ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలవకపోవడంతో రాజమౌళి కొంతవరకు నిరాశ చెందినట్లుగా తెలుస్తోంది. ఇక అందువల్లే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాదు భారీ వసూళ్లను కూడా రాబట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…