Brahmastra- Rajamouli: ఇటీవల కాలం లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమాలలో ఒకటి రణబీర్ కపూర్ హీరో గా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రం..భారీ బడ్జెట్ తో సుమారు మూడేళ్ళ పాటు ఈ సినిమాని తెరకెక్కించారు ఆ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ..గతం లో రణబీర్ కపూర్ మరియు అయాన్ ముఖర్జీ కాంబినేషన్ లో వచ్చిన ‘వేక్ అప్ సిద్’ , ‘ఏ జవానీ హే దివాని’ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ ని దున్నేశాయి..రణబీర్ కపూర్ ని స్టార్ ని చేసాయి ఈ రెండు చిత్రాలు..ఆ సినిమాలు తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడం..దానికి తోడు టీజర్ , ట్రైలర్ మరియు పాటలు ఇలా అన్నీ అభిమానులను విశేషం గా ఆకట్టుకోవడం తో ఈ సినిమాపై అన్నీ ప్రాంతీయ బాషలలో వేరే లెవెల్ హైప్ ఏర్పడింది..హైప్ కి తగ్గట్టుగానే ఈ సినిమాకి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఓపెనింగ్స్ న భూతొ నా భవిష్యతి అనే రేంజ్ లో వచ్చాయి.

విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా ఇండియా లో 128 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చెయ్యడం అందరిని షాక్ కి గురి చేసింది..ఈ ఏడాది విడుదలైన సినిమాలలో ఒక్క #RRR మరియు KGF చాప్టర్ 2 సినిమాలకు మాత్రమే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయి..వాటి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ వసూళ్లను చూస్తున్న సినిమా ఇదే..ఇక ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు అన్నీ ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి 170 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఇక తెలుగు లో కూడా ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది.

తెలుగు లో ఇంత అద్భుతమైన ఓపెనింగ్ రావడానికి ప్రధాన కారణం రాజమౌళి అని చెప్పొచ్చు..ఈ సినిమా తెలుగు ప్రొమోషన్స్ మొత్తం ఆయనే చూసుకున్నాడు..తన సొంత సినిమాకి ప్రొమోషన్స్ ద్వారా రాజమౌళి ఎలాంటి క్రేజ్ రప్పిస్తాడో మన అందరికి తెలిసిందే..బ్రహ్మాస్త్ర సినిమాకి కూడా ఆయన అదే రేంజ్ క్రేజ్ రప్పించాడు..దాని ఫలితమే ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన వసూళ్లు..అయితే తెలుగు లో ఈ సినిమాకి ప్రొమోషన్స్ చెయ్యడం కోసం రాజమౌళి అక్షరాలా 10 కోట్ల రూపాయిలు నిర్మాత కరణ్ జోహార్ నుండి అందుకునట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఒక సినిమాకి ప్రొమోషన్స్ చెయ్యడం కోసం ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక దర్శకుడిగా రాజమౌళి సరికొత్త చరిత్ర సృష్టించాడు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఆయన పేరు కి ఉన్న బ్రాండ్ అలాంటిది మరి.
Also Read:Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రలో.. ఈ కంటైనర్లదే ముఖ్యపాత్ర
[…] […]
[…] […]