Kanguva: హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ మూవీ కంగువా. నవంబర్ 14 వరల్డ్ వైడ్ భారీగా విడుదల చేశారు. ఇది తమిళ బాహుబలి అంటూ ప్రచారం చేశారు. ఈ చిత్ర నిర్మాత కే ఈ జ్ఞానవేల్ రాజా అయితే.. ఒక అడుగు ముందుకు వేసి… కంగువా రూ. 2000 కోట్లు వసూలు చేస్తుంది, అన్నారు. తీరా చూస్తే వంద కోట్లు కూడా కష్టం అయ్యింది. సూర్య కెరీర్లోనే కంగువా భారీ బడ్జెట్ మూవీ. దాదాపు రూ. 350 కోట్లు వెచ్చించి నిర్మించారు.
సూర్య రెండు భిన్నమైన పాత్రలు చేశారు. ఒకటి కంగువా కాగా మరొకటి అలెక్స్. ఈ మూవీ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంది. దానికి నిర్మాతల మాటలు తోడు కావడంతో హైప్ ఏర్పడింది. ఫస్ట్ షో నుండే కంగువా కు నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ కారణంగా ఓపెనింగ్ కూడా దక్కలేదు. కంగువా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 100 కోట్ల గ్రాస్ కి అటూ ఇటూ ఉన్నాయి. రూ. 180 కోట్ల షేర్ రాబడితే కానీ కంగువా బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.
వంద కోట్లకే కంగువా చేతులు ఎత్తేసింది. 3/4 వంతు నష్టాలు డిస్ట్రిబ్యూటర్స్ ఫేస్ చేశారు. అన్ని ఏరియాల్లో కంగువా పెద్ద మొత్తంలో నష్టాలు మిగిల్చింది. ఒక అంచనా ప్రకారం కంగువా మూవీ నిర్మాతలకు రూ. 130 కోట్ల మేర నష్టాలు మిగిల్చింది. ఇది కోలుకోలేని దెబ్బ అనొచ్చు. కంగువా చిత్రానికి శివ దర్శకుడు. ఈ సినిమా కోసం సూర్య రెండేళ్లకు పైగా కష్టపడ్డారు.
ఒక్కోసారి కష్టానికి ఫలితం దక్కకపోగా… తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని కంగువా ఫలితం చూస్తే తెలుస్తుంది. కంగువా మూవీలో దిశా పటాని హీరోయిన్. కాగా క్లైమాక్స్ లో సూర్య తమ్ముడు కార్తీ క్యామియో రోల్ చేశాడు. అతడు విలన్ గా కనిపించాడు. మూవీలో విషయం లేకపోవడంతో కార్తీ గెస్ట్ అప్పీరెన్స్ థ్రిల్ చేయలేదు. దేవిశ్రీ మ్యూజిక్ కూడా సినిమా ప్లాప్ కావడానికి కారణం అయ్యింది. భరించలేని బీజీఎమ్ ఆడియన్స్ కి పిచ్చి లేపింది.