https://oktelugu.com/

Richter scale: భూకంపం తీవ్రతను రిక్టర్ స్కేల్ పైనే కొలుస్తారా.. ఇప్పుడు వచ్చిన కొత్త పరికరాలు ఏంటి?

ఈ భూకంపాన్ని గుర్తించడానికి రిక్టర్ స్కేల్‌ను ఉపయోగిస్తారు. పూర్వ కాలం నుంచి ఉన్న ఈ రిక్టర్ స్కేల్‌ ఇప్పటికీ వినియోగంలో ఉందా? దీన్ని ఉపయోగించే భూకంప తీవ్రతను కొలుస్తున్నారా? లేదా? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 4, 2024 / 04:41 PM IST

    richter scale

    Follow us on

    Richter scale: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సృష్టించింది. ఈ రోజు ఉదయం ఏపీ, తెలంగాణలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయపడి ఇంటి నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ భూకంప తీవ్రతను బట్టి అది ప్రమాదమైనదా? లేదా? అని గుర్తిస్తారు. ఈ భూకంపాన్ని గుర్తించడానికి రిక్టర్ స్కేల్‌ను ఉపయోగిస్తారు. పూర్వ కాలం నుంచి ఉన్న ఈ రిక్టర్ స్కేల్‌ ఇప్పటికీ వినియోగంలో ఉందా? దీన్ని ఉపయోగించే భూకంప తీవ్రతను కొలుస్తున్నారా? లేదా? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో చూద్దాం.

    భూకంప తీవ్రతను కొలిచే రిక్టర్ స్కేల్‌ను అమెరికన్ శాస్త్రవేత్తలు అయిన చార్లెస్ ఎఫ్.రిక్టర్, బెనో గుటెన్ బర్గ్ 1935లో తయారు చేశారు. భూకంపం తరంగాన్ని రిక్టర్ స్కేల్‌కు క్రమాంనకం చేసి సీస్మోగ్రాఫ్ ద్వారా కొలిచేవారు. అమెరికాలో అప్పట్లో ఎక్కువగా భూకంపాలు సంభవించేవి. వాటిని గుర్తించడానికి వీరిద్దరూ రిక్టర్ స్కేల్‌ను రూపొందించారు. భూకంప తీవ్రతను 1 నుంచి 10 వరకు గుర్తించారు. కానీ ఇవి సరిగ్గా భూకంపం తీవ్రతను చూపించలేదు. ఆ తర్వాత జపనీస్ శాస్త్రవేత్త హిరూ కనమోరి, అమెరికన్ భూకంప శాస్త్రవేత్త థామస్ సి. హాంక్స్ 1970లో మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్‌ను తీసుకొచ్చారు. ఇది ఆ సమయంలో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. పెద్ద పెద్ద భూకంపాలు సంభవించిన సమయంలో కూడా ఈ మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్‌ సరైన రిజల్ట్‌ను ఇచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం దీన్నే వాడుతున్నారు. ఏవైనా చిన్న భూకంపాలు వచ్చినప్పుడు మాత్రమే స్థానికంగా కొందరు రిక్టర్ స్కేల్‌ను వాడుతున్నారు.

    మొట్ట మొదటిసారిగా రిక్టర్ స్కేల్ చలామణిలోకి రావడంతో ఇప్పటికీ దీన్ని వాడుతుంటారు. ప్రపంచంలో ఎక్కడైనా భూకంపం సంభవిస్తే.. రిక్టర్ స్కేల్‌పై ఇంత తీవ్రతలో భూకంపం నమోదైందని అధికారులు చెబుతుంటారు. అయితే రిక్టర్ స్కేల్‌పై 1.0 నుంచి 2.9 కంటే తక్కువ తీవ్రతలో భూకంపం సంభవిస్తే సాధారణమే. చాలా తక్కువగా భూకంపం సంభవించిందని భావిస్తారు. అదే రిక్టర్ స్కేల్‌పై 3.0 నుంచి 3.9 వస్తే తక్కువ మొత్తంలో నష్టం జరుగుతుంది. ఇలాంటి భూకంపాలు ఏడాదికి 12,000 నుంచి 100,000 వరకు వస్తాయి. అదే రిక్టర్ స్కేల్‌పై 4.0 నుంచి 4.9 తీవ్రతతో భూకంపం వస్తే కాస్త వస్తువుల విచ్ఛిన్నం అవుతాయి. ఏడాదికి 2,000 నుంచి 12,000 వరకు ఈ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయి.

    రిక్టర్ స్కేల్‌పై 5.0 నుంచి 5.9 తీవ్రతతో భూకంపం కానీ సంభవిస్తే కొంత మేర వరకు నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రతీ ఏడాది ఈ తీవ్రతతో భూకంపాలు 200 నుంచి 2000 వరకు వస్తుంటాయట. రిక్టర్ స్కేల్‌పై 6.0 నుంచి 6.9 తీవ్రతతో వస్తే ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. ఏడాదికి ఇలాంటి భూకంపాలు 20 నుంచి 200 వరకు వస్తాయి. రిక్టర్ స్కేల్‌పై 7.0 నుంచి 7.9 తీవ్రతతో ఒకవేళ భూకంపం సంభవిస్తే దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని నిపణులు చెబుతున్నారు. ఏడాదికి 3 నుంచి 20 వరకు ఇలాంటి భూకంపాలు సంభవిస్తాయి. రిక్టర్ స్కేల్‌పై 8.0 అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే తీవ్రమైన విధ్వంసం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం బీభత్సంగా ఉంటుంది. అయితే ఇలాంటి భూకంపాలు ఏడాది 3 కంటే చాలా తక్కువగా వస్తాయి.