Naga Chaitanya: దేశవ్యాప్తంగా కొన్ని జంటలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ఆ జంటలను అభిమానిస్తూ ఉంటారు. అలాంటి జంటలలో ఒకటి నాగ చైతన్య, సమంత జంట. వీళ్లిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక సెన్సేషన్. విడాకులు తీసుకోవడం అంతకంటే పెద్ద సెన్సేషన్. నేడు నాగ చైతన్య శోభిత ని పెళ్లాడబోతున్నాడు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ వివాహ మహోత్సవం గ్రాండ్ గా జరగబోతుంది. దీనికి సంబంధించి వార్తలు సోషల్ మీడియా లో తక్కువగానే కనిపిస్తాయి. కానీ సమంత, నాగ చైతన్య జంట గురించి మాత్రం ఇప్పటికీ ప్రతీ రోజు ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఈ జంట కి ఉన్నటువంటి క్రేజ్ అలాంటిది. మళ్ళీ వీళ్లిద్దరు ప్యాచప్ అయిపోతే బాగుంటుంది అనుకున్నారు కానీ, అది అసాధ్యం అని అందరికీ అర్థం అయ్యింది. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య సమంత తో ఉన్న జ్ఞాపకాలను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడని లేటెస్ట్ గా వార్త వినిపిస్తుంది.
వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్న కొత్తల్లో సమంత కొన్ని అరుదైన చెట్లని ఇంటి వద్ద నాటి పెంచుతూ ఉండేదట. ఆమె ఈ చెట్లను ఎంతో అపురూపం గా చూసుకునేది. ఆమె విడాకులు తీసుకొని బయటకి వెళ్లిపోయిన తర్వాత నాగ చైతన్య వీటిని పెంచే బాధ్యత తీసుకున్నాడు. రోజూ తనకి ఎంత ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ కూడా వీటికి స్వయంగా ఆయన చేతుల మీదుగా నీళ్లు పోస్తే కానీ తృప్తి గా ఉండదట. అంతే కాదు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ చెట్లను సరిగా చూసుకుంటున్నారా లేదా అని ప్రత్యేకంగా ఆరాలు తీసేవాడట. నాగ చైతన్య కి చెట్లు అంటే ఇష్టం అవ్వడం వల్ల ఇలా చేస్తున్నాడా?, లేకపోతే నిజంగానే ఆయన సమంత మీద ఇష్టం పోగొట్టుకోలేక వీటిని ఆమె జ్ఞాపకంగా పెంచుకుంటున్నాడా అని సోషల్ మీడియా లో అభిమానులు చర్చింకుంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం వీళ్లిద్దరు ఎవరి కెరీర్ ని వాళ్ళు చూసుకుంటూ ఫుల్ బిజీ గా గడుపుతున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం చందుమొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మగధీర తర్వాత అల్లు అరవింద్ తన కెరీర్ లో భారీ బడ్జెట్ పెట్టింది ఈ చిత్రానికే అట. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాని నిర్మిస్తున్నాడు ఆయన. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య కి ఈ సినిమా పెద్ద బ్రేక్ ని ఇస్తుందని మేకర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ బయటకి రానున్నాయి.