https://oktelugu.com/

Mahesh Babu And Rajamouli: మహేష్ బాబు రాజమౌళి కాంబో లో మూవీ కోసం అన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారా..? వర్కౌట్ అవుతుందా..?

తెలుగులో చాలా మంది దర్శకులు సినిమాలు చేస్తున్నప్పటికీ కొందరు మాత్రమే తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ ఉంటారు. అందులో రాజమౌళి మొదటి స్థానం లో ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 11:27 AM IST

    Rajamouli And Mahesh Babu

    Follow us on

    Mahesh Babu And Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి ని పెంచిన దర్శకులలో రాజమౌళి ఒకరు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ జనాలు చాలా చీప్ గా చూసేవారు. మన దగ్గర వచ్చే కథలను అసలు పట్టించుకునే వారు కూడా కాదు. ఎందుకంటే రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలు మాత్రమే మనవాళ్లు తీస్తారు. అంతకు మించిన మంచి కథలు మనవాళ్లు చేయలేరు అంటూ చాలా రకాలుగా హీరోలను డి గ్రెడ్ చేస్తూ మాట్లాడేవారు. మరి ఇలాంటి సందర్భంలో మనవాళ్లు ఎందులో తక్కువ అనే ఒక నినాదాన్ని పెట్టుకొని మనం కూడా భారీ సినిమాలు చేయగలం మన సినిమాలను చూసి ఇండియా మొత్తం గర్వించే రోజు ఒకటి వస్తుంది అంటూ ఎదురు చూసిన మన మేకర్స్ అందరికీ రాజమౌళి రూపం లో సమాధానం దొరికింది. ‘బాహుబలి ‘ సినిమాతో ఒక్కసారిగా ఇండియా వైడ్ గా పెను ప్రభంజనాన్ని సృష్టించిన రాజమౌళి… ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగాడు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా నెంబర్ వన్ ఇండస్ట్రీగా నిలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబుని హీరోగా పెట్టి చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ ని కూడా రాజమౌళి ఇప్పటివరకు వదలలేదు. కానీ ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.

    ఒకవేళ ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ కనక బయటికి వచ్చినట్టయితే ఇంకా ఆ అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే పాన్ వరల్డ్ లో ఒక భారీ సంచలనాన్ని సృష్టించడానికి మన మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది.

    మరి రాజమౌళి ఏ ధైర్యంతో ఈ సినిమా మీద అన్ని కోట్లు పెడుతున్నాడు అంటూ పలు రకాల అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమా సక్సెస్ అయితే పర్లేదు. కానీ ఒకవేళ తేడా కొడితే మాత్రం ప్రొడ్యూసర్ భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా అనే అనుమానానికి కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి రాజమౌళి లాంటి దర్శకుడు ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మినిమం గ్యారంటీగా ఉంటుంది.

    అంతే తప్ప సినిమాకు నష్టాలు అయితే రావు అనే విధంగా ప్రేక్షకులలో గానీ, ప్రొడ్యూసర్స్ లో గాని భారీ నమ్మకం అయితే ఉంది. ఇక ఈ సినిమా 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కూడా 3000 కోట్ల కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో జక్కన్న ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి జక్కన్న చేసే ఈ పెద్ద ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా నిలవాలని ఇండియన్ సినిమాకి అలాగే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వెలుగొందాలని మనం కూడా కోరుకుందాం…