https://oktelugu.com/

Bigg Boss 8 telugu – Soniya : కల్లోల ‘మంథని’ నుంచి.. ‘వర్మ’ దగ్గరకు ఎలా చేరింది.. బిగ్ బాస్ లోకి ఎలా వెళ్లింది?

గతంలో జార్జిరెడ్డి సినిమా లో హీరో చెల్లెలుగా, కరోనా అనే సినిమాలో కూడా నటించారు. మంథని మండలం గాజులపల్లె కు చెందిన రైతు ఆకుల చక్రపాణి కూతురు. మంథనిలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన సొనియా, బీటెక్ పూర్తి చేసి, తెలంగాణ జాగృతిలో ప్రధాన భూమిక నిర్వహించింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 4, 2024 / 11:27 AM IST

    bigg boss Akula Soniya

    Follow us on

    Bigg Boss 8 telugu – Soniya : బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్ సీజన్ 8లో ఆరో కంటెస్టెంటుగా పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఆకుల సోనియాకు అవకాశం లభించింది. ఆదివారం ప్రారంభమైన ఈ షో లో 6వ కాంటెస్టెంట్ గా సోనియా అడుగుపెట్టింది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘దిశ ‘ సినిమా హీరొయిన్ గా నటించిన సోనియా కరాటేతో పాటు కలరి విద్య కూడా వచ్చంటూ స్టేజ్ మీద చెప్పింది.

    సానియా ఇదివరకూ రాంగోపాల్ వర్మ సినిమాల్లో నటించింది. 2022 వ సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ కరోనా నేపథ్యంలో తీసిన సినిమాలో ఆమె మెయిన్ లీడ్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అందుకే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె కోసం స్వయంగా రాంగోపాల్ వర్మనే స్క్రీన్ మీదకు వచ్చారు. ఒక వీడియోను రికార్డ్ చేసి పంపించారు. దాన్ని నాగార్జున బిగ్ బాస్ లాంచింగ్ లో సానియా ఎంట్రీ వేళ చూపించారు. ‘నీ టాలెంట్ అంతా చూపించి ఖచ్చితంగా బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటూ వర్మ సానియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. టైటిల్ గెలిచాక పార్టీ చేసుకుందాం అంటూ చిల్ చేశారు.

    గతంలో జార్జిరెడ్డి సినిమా లో హీరో చెల్లెలుగా, కరోనా అనే సినిమాలో కూడా నటించారు. మంథని మండలం గాజులపల్లె కు చెందిన రైతు ఆకుల చక్రపాణి కూతురు. మంథనిలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన సొనియా, బీటెక్ పూర్తి చేసి, తెలంగాణ జాగృతిలో ప్రధాన భూమిక నిర్వహించింది. తెలంగాణ ఉద్యమ కారుడు ప్రకాశ్ కు పీఏ గా పని చేస్తూ మరోవైపు సినీ రంగంలో ప్రవేశించింది. అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న సోనియా బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో మంథని ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

    మంథని అంటే ఒకప్పుడు నక్సలైట్లు, మావోయిస్టులకు పెట్టని కోట.. ఇప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మావోయిస్టులు సంచరించే.. చత్తీస్ ఘడ్ నుంచి వచ్చే ఏరియా ఇదే.. 1999న నక్సలైట్ల కాల్పుల్లో అప్పటి స్పీకర్ శ్రీపాదరావు మరణించారు. ఆయన కుమారుడే నేటి మంత్రి శ్రీధర్ బాబు. అంతటి కల్లోల ప్రాంతం నుంచి సానియా బిగ్ బాస్ వరకూ రావడం గొప్పేనంటూ అక్కడి వారు ప్రశంసిస్తున్నారు.

    -దహగాం శ్రీనివాస్