NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి గుర్తింపు అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందడమే కాకుండా గొప్ప నటులుగా కూడా మంచి పేరును సంపాదించుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాత చిరంజీవి అన్ని రకాల సినిమాలను చేసి గొప్ప నటుడిగా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు. ఇక ఈయన తర్వాత జనరేషన్ లో వచ్చిన హీరోల్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ , ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి నటులు కూడా మంచి నటులుగా వెలుగొందుతూ తమకంటూ ఉన్న పేరు ప్రఖ్యాతలను మరింత రెట్టింపు చేసుకునే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సంచలనాలకు మారుపేరుగా మారుతున్న కోట శ్రీనివాసరావు జూనియర్ ఎన్టీఆర్ మీద కొన్ని ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు. ప్రస్తుతం ఉన్న ఈ యంగ్ హీరోలందరిలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే చాలా టాలెంటెడ్ నటుడని ఆయన వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలా ముందుకు సాగుతుందని, ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అంటూ ఆయన కామెంట్లు చేశారు.
ఇక మిగతా హీరోల మధ్య చాలా వరకు రాజకీయాలు నడుస్తూ ఉంటాయని దానివల్లే తను చాలావరకు పాత్రలను కూడా చేయకుండా మిస్ అయిపోయాడని కొంత మంది హీరోల మీద ఫైర్ అయ్యాడు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా కోట శ్రీనివాసరావు గొప్పగా చెప్పడం వలన చాలామంది ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. నిజానికి కూడా శ్రీనివాసరావు చాలా మంచి నటుడు వ్యక్తిత్వ పరంగా ఆయన మీద కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ నటన పరంగా మాత్రం ఆయన చాలా మంచి నటుడు అనే విషయం మనందరికీ తెలిసిందే.
ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. విలన్ గా, కామెడీ విలన్ గా, పాజిటివ్, నెగిటివ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క పాత్ర లో నటించి మెప్పించాడు. ఇక అలాంటి నటుడు ఎన్టీఆర్ ని పొగుడుతూ ఉండడం చూసిన ఎన్టీయార్ అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఫ్యూచర్ లో జూనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోగా నెంబర్ వన్ నటుడిగా ఎదుగుతాడా?
లేదంటే అతనిని బీట్ చేసే హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా? అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తి చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాలో కొన్ని రషేస్ చూసిన బోణీ కపూర్ కూడా ఎన్టీయార్ కి అభిమానిగా మారిపోయాను అంటూ కొన్ని కామెంట్లైతే చేశాడు…ఇక దాంతో ఇప్పుడు ఎన్టీయార్ పేరు బాలీవుడ్ మొత్తం వినిపిస్తుంది…