Chiranjeevi: ‘ఇంద్ర’ లోని వీణ స్టెప్ కోసం చిరంజీవి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసాడో తెలుసా..? ఇంత కసి ఎవరిలో ఉండదేమో!

151 కేంద్రాలలో 50 రోజులు, 120 కేంద్రాలలో 100 రోజులు, 32 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శితమైన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అలాంటి చిత్రం రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వబోతుంది.

Written By: Vicky, Updated On : August 21, 2024 1:17 pm

Chiranjeevi(4)

Follow us on

Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తించుకునే ఇండస్ట్రీ హిట్స్ ఉంటాయి. కేవలం అభిమానులకు మాత్రమే కాదు మూవీ లవర్స్ కి కూడా ఆ ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఎంతో ప్రత్యేకం. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందరికీ మిగిల్చిన సినిమాలు అవి. అలాంటి సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ కూడా ఉంటుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్న రోజులవి. అలాంటి ట్రెండ్ లో వచ్చిన ఇంద్ర ఒక సునామీ సృష్టించింది అనే చెప్పాలి. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అప్పట్లో 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

అంతే కాకుండా 151 కేంద్రాలలో 50 రోజులు, 120 కేంద్రాలలో 100 రోజులు, 32 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శితమైన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అలాంటి చిత్రం రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో మొదలయాయ్యి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుండే ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. అంతే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి బ్రహ్మాండమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇకపోతే ఈ సినిమా మరోసారి రీ రిలీజ్ అవుతున్న ఈ నేపథ్యంలో డైరెక్టర్ బి గోపాల్ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు. ఈ చిత్రంలోని ‘దాయిదాయి దామ్మా’ పాట అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాటలో చిరంజీవి వేసిన వీణ స్టెప్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంటుంది. కేవలం ఈ పాట కోసమే అభిమానులు రిపీట్ గా ఈ చిత్రానికి వెళ్తూ ఉండేవారు.

అయితే ఈ పాట మేకింగ్ సమయంలో చిరంజీవి పడిన కష్టం గురించి డైరెక్టర్ బి గోపాల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ చిరంజీవి గారు కొరియోగ్రాఫర్ వేయించే చెప్పేది బాగా అర్థం చేసుకొని కేవలం ఒకే ఒక్క టేక్ లో చేసేస్తాడు. కానీ వీణ స్టెప్ కోసం ఆయన ఎంతో హోమ్ వర్క్ చేసాడు. దీని కోసం ఆయన ప్రత్యేకంగా 5 గంటల పాటు ప్రాక్టీస్ చేసాడు. లారెన్స్ మాస్టర్ పర్ఫెక్ట్ గా వచ్చింది , రిహార్సల్స్ అవసరం లేదు అన్నయ్యా అని చెప్పినా కూడా చిరంజీవి మాట వినలేదట. రిహార్సల్స్ చెయ్యాల్సిందే అని పట్టుబట్టి , తన మనసుకి పూర్తి స్థాయిలో సంతృప్తి కలిగే వరకు ప్రాక్టీస్ చేసాడు. ఆయనలో అప్పట్లో అంత తపన, కసి ఉండేది. ఏ హీరోలో కూడా అది నేను చూడలేదు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.