KGF Chapter 2: ప్రస్తుతం సినీ ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమా కేజీఎఫ్ చాప్టర్-2. గత మూడేండ్లుగా ఊరిస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లకు వచ్చి ప్రభంజనం సృష్టిస్తోంది. అందరూ ఊహించినట్టుగానే అంచనాలకు మించి అన్నట్టు మూవీ ఉంది. మూడేండ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కేజీఎఫ్-1 సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయింది.
ఇక దానికి కొనసాగింపుగా వచ్చిన చాప్టర్-2 అంతకు మించి అన్నట్టు గానే ఉంది. ఇక ఇందులోని ప్రతి పాత్ర కూడా ఓ సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ పాత్రలకు తెలుగు వెర్షన్ డబ్బింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మరి ఏ పాత్రకు ఎవరు తెలుగులో డబ్బింగ్ చెప్పారో చూద్దాం.
రాకీ భాయ్ పాత్ర చుట్టే సినిమా మొత్తం ఉంటుంది. అందుకే అన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పే వాసు నే ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పాడు.
చిన్నతనంలోని రాకీ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్. అప్పుడు కూడా అతని వాయిస్‌లో బేస్ ఉండాలని ఆ పాత్రకు చైల్డ్ ఆర్టిస్ట్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు.
ఇక మొదటి చాప్టర్ లో భయంకరమైన విలన్‌గా నటించిన గరుడ పాత్రకు డబ్బింగ్ చెప్పింది బిగ్ బాస్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చే ఆర్టిస్ట్ రాధాకృష్ణ.
సినిమా స్టోరీని మొదటి చాప్టర్‌లో వివరించే అనంతనాగ్ పాత్ర చాలా కీలకం. అందుకే ఈ పాత్రకు శుభలేక సుధాకర్ తో డబ్బింగ్ చెప్పించారు.
రాకీ తల్లి శాంతి పాత్ర చాలా కీలకం. మొదటి నుంచి చివరి వరకు ఈ పాత్ర ఉంటుంది. హీరో పాత్రను నడిపంచేది ఆమెనే. ఈ పాత్రకు నటి కమల నాయుడు వాయిస్ చెప్పింది.
ఇక హీరోయిన్ రీనా పాత్రకు తెలుగులో ఆర్టిస్ట్ జ్యోతి వర్మ డబ్బింగ్ చెప్పింది.
సినిమా స్టోరీని ముందుకు తీసుకెళ్లే పాత్ర మాళవిక అవినాష్ ది. ఈ పాత్రతో పాటు రాకీని అడ్డుకునే పాత్ర అంటే ప్రధాన మంత్రిగా నటించిన రవీనా టండన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పింది ఒక్కరే. ఆమెనే క్రాంతి. ఇలా తెలుగులో అందరి పాత్రలకు అద్భుతంగా వాయిస్ చెప్పారు వీరంతా.
Also Read:Nellore Politics: ఒంటరైన అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరు పెద్దా రెడ్ల భారీ స్కెచ్
Recommended Videos