Star Comedian: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనే మాట చాలామందికి వర్తిస్తుంది. ముఖ్యంగా మన టాలీవుడ్‌లో ఈ మాట ఎంతో మందికి సూట్ అవుతుందనే చెప్పుకోవాలి. చాలామంది సొంతంగా ఎదిగి స్టార్ హీరోలుగా రాణిస్తే.. ఇంకొందరు కమెడియన్లుగా మారి సత్తా చాటుతున్నారు. చిన్న స్థాయి నుంచి వచ్చి హీరోగా ఆ తర్వాత కమెడియన్ గా మారిన వ్యక్తి అలీ.
అయితే ఇప్పుడు అందరికీ ఆయన ఓ స్టార్ కమెడియన్‌గా తెలుసు. కానీ ఆయన కెరీర్‌కు ముదు ఏం చేసేవారో చాలామందికి తెలియదు. ఆయన ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. వృత్తి రీత్యా రోడ్డు పక్కన బట్టలు, లుంగీలు అమ్మేవారు. అలా అమ్ముతున్న సమయంలో ఓ పెద్దాయన అలీ దగ్గరకు వచ్చి ఇవన్నీ నువ్వు ఎలా అమ్ముతున్నావంటూ అడిగాడు.
Also Read: Pawan Kalyan- Sampath Nandi: పవన్ తో పూర్తి చేయగలడా ?.. అసలు పవన్ ఛాన్స్ ఇస్తాడా ?
ఆయనెవరో కాదండోయ్.. అప్పటికే తెలుగులో పెద్ద డైరెక్టర్‌గా పేరు గాంచిన మోహన్ మిత్ర. ఆ విషయం తెలియక అలీ ఏదో వెటకారంగా సమాధానం ఇచ్చాడు. దాంతో ఆయనకు కోపం వచ్చింది. ఇంతలోనే అలీ తండ్రి అక్కడకు వచ్చి ఆయన్ను గుర్తు పట్టి గురువుగారు ఏమైంది.. మా వాడు ఏమైనా ఇబ్బంది పట్టాడా అంటూ అడిగాడు. అబ్బే అదేం లేదు అంటూ నవ్వుతూ.. పిల్లాడితే ఈ పని ఎందుకు చేయిస్తున్నావ్ అని అడిగాడు మోహన్ మిత్ర.
వీడికి చదువు అబ్బట్లేదు గురువుగారు.. అందుకే ఈ పని చేయిస్తున్నా అని సమాధానం ఇచ్చాడు అలీ తండ్రి. అప్పుడు అలీ షోలే మూవీలోని డైలాగ్ చెప్పడంతో మోహన్ మిత్ర ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే అలీ ఇంకొందరు హీరోల వాయిస్‌ను మిమిక్రీ చేసి చూపించడంతో.. అతనిలోని ట్యాలెంట్ ను గుర్తించిన మోహన్ మిత్ర.. తాను చేసే ప్రతి షోలో అలీకి అవకాశం ఇచ్చాడు.
అలీ యమలీల సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఆయన వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలా ఒకప్పుడు రోడ్డు పక్కన లుంగీలు అమ్మిన అలీ.. ఆ తర్వాత టాలీవుడ్ కమెడియన్ కింగ్ గా మారాడన్నమాట.
Also Read:Bigg Boss OTT: టార్గెట్ బిందు.. చివరకు శివ కూడా అఖిల్ బ్యాచ్ తో కలిసిపోయాడా?
Recommended Videos