Bigg Boss 7 : బుల్లితెర పై సంచలనం సృష్టించిన రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్. ఇతర భాషల్లో మన తెలుగు లో కంటే ముందుగానే ప్రారంభం అయ్యింది. ఇక్కడి ఆడియన్స్ కి కొత్త కాబట్టి ఎలా తీసుకుంటారో, అసలు సక్సెస్ అవుతుందా లేదా అనే సందేహం ఉండేది.మొదటి సీజన్ ప్రారంభం లో ఆడియన్స్ కి ఏమి అర్థం కాలేదు, బాగా బోర్ కొట్టేది. క్రమం గా షో లో టాస్కులు ఆడుతూ ఉండడం వల్ల ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయ్యారు, అలా మొదటి సీజన్ బంపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఏకంగా 5 సీజన్స్ ని నిర్వహించారు.
వాటిల్లో 4 సీజన్స్ బంపర్ హిట్ అయ్యాయి,.ఆరవ సీజన్ మాత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీనితో 7 వ సీజన్ ఎలా అయినా గ్రాండ్ హిట్ చెయ్యాలనే కసితో ఉంది స్టార్ మా టీం, అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ చరిత్ర లో ఎన్నడూ లేని విధమైన ఐడియాస్ ని ఈ సీజన్ ద్వారా పరిచయం చెయ్యబోతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం ఆరవ సీజన్ లో చేసిన తప్పులను 7 వ సీజన్ లో రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది బిగ్ బాస్ టీం. ఆరవ సీజన్ ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం కంటెస్టెంట్స్. కేవలం ఒకరిద్దరు మినహా మిగిలిన కంటెస్టెంట్స్ మొత్తం ప్రేక్షకులకు ముఖ పరిచయం లేని వాళ్ళే. కానీ ఈసారి మాత్రం తరచూ ఆడియన్స్ కి బుల్లితెర ద్వారా బాగా పరిచయం ఉన్న సెలబ్రిటీస్ ని పిలవబోతున్నారట.
ఇక ఈ సీజన్ లో ఎక్కువగా విడాకులు తీసుకున్న జంటని కంటెస్టెంట్స్ గా ఆహ్వానిస్తున్నారట. అంతే కాదు సీక్రెట్ రూమ్ లో కూడా విడిపోయిన జంటని ఉంచబోతున్నారట. ఇంత ఆసక్తిఆకారమైన ఐడియా ఇప్పటి వరకు ఏ భాషలో కూడా ప్రయోగించలేదు, మొట్టమొదటిసారి మన తెలుగు లోనే ప్రయోగిస్తున్నారు. క్లిక్ అయితే మాత్రం TRP రేటింగ్స్ మామూలు రేంజ్ లో ఉండవు. చూడాలి మరి ఏమి జరగబోతుందో!.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Divorce couple in secret room crazy concept of bigg boss 7
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com