https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయా..?

Allu Arjun: ఆగస్టు 15వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన సినిమా యూనిట్ ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ పోన్ చేయడం పట్ల అల్లు అర్జున్ చాలావరకు ఇబ్బంది పడుతున్నాడట.

Written By:
  • Gopi
  • , Updated On : June 18, 2024 / 10:09 AM IST

    Allu-Arjun-Sukumar

    Follow us on

    Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇంటిలిజెంట్ డైరెక్టర్ అయిన సుకుమార్ వీళ్లిద్దరి మధ్య చాలా సంవత్సరాల నుంచి మంచి బాండింగ్ అయితే ఉంది. నిజానికి అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరి కెరియర్లు కూడా దాదాపు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. ఆర్య సినిమాతో వీళ్ళిద్దరికీ చాలా మంచి బ్రేక్ త్రూ అయితే దొరికింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అయితే చెడిపోకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘పుష్ప 2’ వాయిదా మీద అల్లు అర్జున్ సుకుమార్ మీద కొంచెం కోపంతో ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    ఎందుకంటే ఆగస్టు 15వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన సినిమా యూనిట్ ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ పోన్ చేయడం పట్ల అల్లు అర్జున్ చాలావరకు ఇబ్బంది పడుతున్నాడట. ఇక ఈ విషయంలోనే సుకుమార్ మీద కొంతవరకు కోపంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సుకుమార్ మాత్రం ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే షూటింగ్ ఇంకొంత బ్యాలెన్స్ ఉందట. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా వరకు బాగా చేయలేదట మళ్లీ దాన్ని వేరేవాళ్ళ తో చేయిస్తున్నారట.

    Also Read: Bhairava Anthem Song: కల్కి నుండి భైరవ యాంథమ్ ఫుల్ సాంగ్ వచ్చేసింది… ఆ గెటప్ లో ప్రభాస్ హైలెట్ భయ్యా!

    ఇక అలాగే రీసెట్ గా అల్లు అర్జున్ చేసిన పొలిటికల్ క్యాంపెనింగ్ కి మెగా ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. ఇక పుష్ప 2 సినిమా కనక ఇప్పుడు రిలీజ్ అయితే దానిమీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సినిమాని ఒక నాలుగు నెలల పాటు వాయిదా వేయాలనే ఉద్దేశ్యం తోనే సుకుమార్ ఇలాంటి డెసిజన్ తీసుకున్నాడట. ఇక అల్లు అర్జున్ మాత్రం తన అభిమానులకి తను ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోతున్నాను అంటూ సుకుమార్ దగ్గర మాట్లాడటంతో సుకుమార్ మాత్రం డిసెంబర్ 6వ తేదీన మన సినిమాను రిలీజ్ చేసి గ్రాండ్ సక్సెస్ ని కొట్టబోతున్నాం.

    Also Read: Mr.Bachchan Teaser Review : మిస్టర్ బచ్చన్ టీజర్ రివ్యూ : నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్, అంచనాలు పెంచేసిన రవితేజ!

    మీ ఫ్యాన్స్ కి మాట ఇస్తున్నాను ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అవుతుందని సుకుమార్ చెప్పారట. మరి మొత్తానికైతే వీళ్ళిద్దరూ మళ్లీ కలిసి పోయి బాగా మాట్లాడుకుంటున్నారా లేదంటే ఎడముఖం పెడముఖం పెట్టుకొని ఉంటున్నారా అనేది తెలియాల్సి ఉంది…