https://oktelugu.com/

Star Director Wife: ఈ ఫోటోలో ఉన్నది హీరోయిన్ కాదు..ఒక స్టార్ డైరెక్టర్ భార్య… ఇంతకీ ఈమె ఎవరంటే..?

Star Director Wife: ముఖ్యంగా ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే తను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతాడు. ఇక ఈ విషయాన్ని చాలా మంది దర్శకులు ప్రూవ్ చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 7, 2024 / 12:44 PM IST

    Director Atlee Kumar's wife Krishna Priya Mohan

    Follow us on

    Star Director Wife: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఒక దర్శకుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ముందుకు సాగాలి అంటే తన మెంటల్ స్టెబిలిటీ అనేది బాగుండాలి. ముఖ్యంగా ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే తను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతాడు. ఇక ఈ విషయాన్ని చాలా మంది దర్శకులు ప్రూవ్ చేశారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) లాంటి డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ గా మారడానికి తన భార్య అయిన రమా రాజమౌళి(Rama Rajamouli) చాలా వరకు హెల్ప్ చేసింది అంటూ ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం మనం చూశాం..

    ఇక అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన అట్లీ(Atlee) లాంటి స్టార్ డైరెక్టర్ కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడానికి తన భార్య అయిన కృష్ణప్రియ(Krishna Priya) చాలా వరకు హెల్ప్ చేసింది అంటూ పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నిజానికి కృష్ణప్రియ మొదట్లో సీరియల్లో, సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి బిజీగా ఉండేది. అయితే అట్లీ శంకర్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ కలుసుకున్నారు. అలా వీళ్ళిద్దరి మధ్య మంచి పరిచయమైతే ఏర్పడింది. ఇక ఆ తర్వాత ‘రాజా రాణి’ అనే సినిమాని చేశాడు. ఇక దీని ప్రీమియర్ కి కృష్ణప్రియ వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చి వచ్చి చూపించింది.

    Also Read: Love Mouli Movie Review: లవ్ మౌళి మూవీ రివ్యూ…

    ఇక ఇద్దరు సినిమా ఇండస్ట్రీ లోనే ఉంటున్నారు. కాబట్టి వీళ్ళ పెళ్లికి పెద్దలు కూడా అభ్యంతరం చెప్పలేదు. దాంతో 2014వ సంవత్సరంలో వీళ్ళ పెళ్లి జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు అట్లీ వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక కోలీవుడ్ లో మొదలైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం బాలీవుడ్ వరకు సాగింది. ఇక గత సంవత్సరం షారుఖ్ ఖాన్ తో ‘జవాన్ ‘ అనే సినిమా తీసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇక తన సక్సెస్ కి కారణం ఆయన భార్య అయిన కృష్ణ ప్రియ అలియాస్ ప్రియ అట్లీ అని తను చాలా గర్వంగా చెబుతూ ఉంటాడు. తనకు ఇంట్లో ఏమాత్రం స్ట్రెస్ లేకుండా అన్ని తనే చూసుకుంటుందని అట్లీ పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు.

    Also Read: Satyabhama Movie Review: సత్యభామ ఫుల్ మూవీ రివ్యూ…

    ఇక ఇదిలా ఉంటే అట్లీ భార్య మాత్రం హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందంతో ప్రేక్షకులందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇక పెళ్లి తర్వాత ప్రియ అట్లీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం నిర్మాణరంగం వైపు అడుగులు వేస్తుంది. ఏ ఫర్ ఆపిల్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి అందులో పలు సినిమాలను కూడా నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారు…