Jagan: జగన్ కు సోనియా ఫోన్.. ఆ విషయంపై ఆరా

జాతీయస్థాయిలో ఈసారి ఎన్డీఏ కూటమి కూడా పుంజుకుంది. మ్యాజిక్ ఫిగర్ కు చెరువులో నిలిచింది. దీంతో ఎలాగైనా బిజెపికి అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ కు సైతం కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించిందని తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : June 7, 2024 2:03 pm

Jagan

Follow us on

Jagan: ఏపీ సీఎం జగన్ ను సోనియా గాంధీ సంప్రదించారా? ఆయనకు నేరుగా ఫోన్ చేశారా? ఇండియా కూటమికి మద్దతు తెలపాలని కోరారా?ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తున్న వేళ.. వైసిపి చేస్తున్న ప్రచారం వెనుక నిజం ఎంత? అన్నది తెలియాల్సి ఉంది. బిజెపి పరంగా కేంద్రంలో మ్యాజిక్ ఫిగర్ దాటకున్నా.. ఎన్డీఏ పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మెజారిటీ దక్కించుకున్నారు. అందుకే రేపు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమానికి చంద్రబాబు, పవన్, కూటమి ఎంపీలు, కీలక నేతలు హాజరుకానున్నారు.

జాతీయస్థాయిలో ఈసారి ఎన్డీఏ కూటమి కూడా పుంజుకుంది. మ్యాజిక్ ఫిగర్ కు చెరువులో నిలిచింది. దీంతో ఎలాగైనా బిజెపికి అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందుకే చంద్రబాబుతో పాటు నితీష్ కుమార్ కు సైతం కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించిందని తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరు నేతలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న చిన్నా చితకా పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారం చేపట్టాలనిఇండియా కూటమి భావిస్తోంది.ఏపీలో నాలుగు స్థానాలను సాధించిన వైసీపీకి కూడా అందులో భాగంగానే సంప్రదించినట్లు సమాచారం. నేరుగా సోనియాగాంధీ జగన్ కు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితేదీనిపై జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎన్డీఏకు కాదని ఇండియా కూటమికి మద్దతు తెలిపితే పరిస్థితి ఎలా ఉంటుందో జగన్ కు తెలుసు.అందుకే ఆయన సమ్మతించలేదన్నట్టు సమాచారం.

అయితే జగన్ కు నేరుగా సోనియా గాంధీ ఫోన్ చేసే అవకాశం ఉందా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ను విభేదించి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంలో సోనియా గాంధీ ఆగ్రహంగా ఉండేవారు. అందుకే ఆమె షర్మిలను దగ్గరకు తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు షర్మిలను సంప్రదించకుండా జగన్ ను సోనియా గాంధీ ఆశ్రయించరని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే వైసిపి తనకు తానుగా ఈ ప్రచారం చేసుకుంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా మారడంతో.. ఇండియా కూటమి వైపు వైసిపి వెళుతుందన్న చర్చకుభారీ తీయాలన్నదే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే ఈ తరహా ప్రచారానికి తెరతీసారని టిడిపి అనుమానిస్తోంది. ఒకవేళ షర్మిల అనుమతి తీసుకోకుండానే సోనియాగాంధీ జగన్ తో మాట్లాడి ఉంటే.. ఈపాటికి షర్మిల నుంచి ఒకరకమైన రెస్పాన్స్ వచ్చేది. కానీ ఆమె సైతం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు.అందుకే ఎక్కువమంది ఇది ఫేక్ గా తేల్చేస్తున్నారు. మరి ఏం జరిగిందో వారికే తెలియాలి.