https://oktelugu.com/

Nani Heroine: అసలు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన నాని హీరోయిన్… ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా?

Nani Heroine: భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలో శరణ్య హీరోయిన్ గా నటించింది. భీమిలి కబడ్డీ జట్టు తమిళ్ హిట్ మూవీ వెనిల కబడ్డీ కుజు చిత్రానికి రీమేక్. ఒరిజినల్ లో శరణ్య నటించింది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 7, 2024 / 12:56 PM IST

    Do you know how Nani Heroine Saranya Mohan

    Follow us on

    Nani Heroine: నాని హీరోయిన్ శరణ్య మోహన్(Saranya Mohan) ని ఇప్పుడు చూస్తే అసలు గుర్తు పట్టలేరు. ఆమె అంతగా మారిపోయింది. శరణ్య లేటెస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ అవాక్కు అవుతున్నారు. శరణ్య మోహన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టింది. కేరళలో పుట్టిన అమ్మడు. మలయాళ, తమిళ్ చిత్రాల్లో ఎక్కువగా నటించింది. విలేజ్ లో వినాయకుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కృష్ణుడు హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ పర్వాలేదు అనిపించుకుంది. కృష్ణుడు-రావు రమేష్(Rao Ramesh) మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి.

    అనంతరం నానికి జంటగా ఛాన్స్ పట్టేసింది. భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలో శరణ్య హీరోయిన్ గా నటించింది. భీమిలి కబడ్డీ జట్టు తమిళ్ హిట్ మూవీ వెనిల కబడ్డీ కుజు చిత్రానికి రీమేక్. ఒరిజినల్ లో శరణ్య నటించింది. ఆ చిత్ర రీమేక్ లో కూడా శరణ్య హీరోయిన్ గా నటించడం విశేషం. ఈ ట్రాజిక్ లవ్ డ్రామాలో శరణ్య నటనకు ప్రశంసలు దక్కాయి. తెలుగులో కూడా భీమిలి కబడ్డీ జట్టు హిట్ టాక్ తెచ్చుకుంది.

    Also Read: Love Mouli Movie Review: లవ్ మౌళి మూవీ రివ్యూ…

    భీమిలి కబడ్డీ జట్టు చిత్రం అనంతరం కళ్యాణ్ రామ్ కత్తి చిత్రంలో శరణ్య నటించారు. వరుణ్ సందేశ్ కి జంటగా హ్యాపీ హ్యాపీగా చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో శరణ్య మరలా తెలుగులో నటించలేదు. మలయాళం, కన్నడ, తమిళ్ చిత్రాలు చేసింది. 2014 తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ కి పూర్తిగా దూరమైంది.

    Also Read: Satyabhama Movie Review: సత్యభామ ఫుల్ మూవీ రివ్యూ…

    2015లో శరణ్య తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ డాక్టర్ అరవింద్ కృష్ణన్ ని వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం నటనకు గుడ్ బై చెప్పింది. ఆమెకు ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. క్యూట్ గా కుర్రాళ్ళ గుండెల్లో పాగా వేసిన శరణ్య లేటెస్ట్ లుక్ కొంచెం షాక్ ఇచ్చేలా ఉంది. ఆమెకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా? అని ఆశ్చర్యపోతున్నారు. శరణ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది.