Game Changer Movie: ఇండస్ట్రీ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న నిర్మాతలలో ఒకరు దిల్ రాజు. ఈయన నిర్మించిన సినిమాలలో అత్యధిక శాతం సూపర్ హిట్ సాధించినవే ఉన్నాయి. మిగతా నిర్మాతలు లాగా భారీ బడ్జెట్ సినిమాలు చేయకుండా, తక్కువ బడ్జెట్ లోనే సినిమాలు తీసి ఎక్కువ లాభాలు అందుకోవడం దిల్ రాజు స్టైల్. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇదే సూత్రం అనుసరిస్తూ వచ్చాడు. కానీ కెరీర్ లో మొట్టమొదటిసారి ఆయన రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే భారీ బడ్జెట్ సినిమా చేయడానికి పూనుకున్నాడు. శంకర్ దర్శకత్వం లో సినిమా అంటే ఖర్చులు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం పాటలకే ఆయన నిర్మాతలతో కోట్ల రూపాయిలు ఖర్చు చేయిస్తాడు. ‘గేమ్ చేంజర్’ కి అయితే ఇంకా ఎక్కువ ఖర్చు చేయించాడు.
సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవ్వడం వల్ల దిల్ రాజు కి బడ్జెట్ విషయం లో చుక్కలు కనపడ్డాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఎప్పుడో పూర్తి అవ్వాల్సిన ఈ సినిమా ‘ఇండియన్ 2’ కారణంగా ఆలస్యం అయ్యింది. దీంతో దిల్ రాజు తన ఫైనాన్షియర్స్ కి వడ్డీలు దాదాపుగా 350 కోట్ల రూపాయిలు కట్టినట్టు ఇండస్ట్రీ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఇక రామ్ చరణ్ ఈ చిత్రానికి ఏకంగా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. అలాగే శంకర్ రెమ్యూనరేషన్ కూడా 40 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఉంటుంది. ఇలా కేవలం రెమ్యూనరేషన్స్ మరియు వడ్డీల విలువనే 500 కోట్ల రూపాయలకు తేలింది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ అంచనా వేస్తె 650 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే ఈ సినిమా ఇప్పటికీ 250 కోట్ల రూపాయిల వరకు జరిగిందని, ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా మరో 200 కోట్ల రూపాయలకు జరుగుతుందని, సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంటే లాభాల్లోకి వస్తాడని అంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని సంక్రాంతి కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ముందుగా డిసెంబర్ 20 వ తారీఖున విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ ఆ తేదీన రెండు హాలీవుడ్ చిత్రాలు విడుదల అవుతున్నాయి, అలాగే పుష్ప 2 చిత్రం విడుదలై కేవలం రెండు వారాలు మాత్రమే పూర్తి అవుతుంది. థియేటర్స్ సమస్యలు రావడం, హైదరాబాద్, ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో తక్కువ షోస్ పడడం వంటి పరిస్థితులకు ఆస్కారం ఉంది. అందుకే సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. సంక్రాంతికి విశ్వంభర చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ మెగాస్టార్ చిరంజీవి కి చికున్ గన్యా కారణంగా కొంతకాలం డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పడం తో షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఇప్పుడు విశ్వంభర స్థానం లో గేమ్ చేంజర్ విడుదల అవ్వబోతుంది, త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు మేకర్స్