https://oktelugu.com/

Dil Raju  : రంగంలోకి దిల్ రాజు…రేవతి కుటుంబానికి పరామర్శ.. ఇండస్ట్రీ సమస్యలు తీర్చబోతున్నాడా..?

ఇప్పుటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం వరుస వివాదాలు ఎదురవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటన ఇప్పటికి యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను సైతం విపరీతంగా బాధిస్తుందనే చెప్పాలి... రేవతి అనే మహిళ చనిపోవడం ఒకటైతే శ్రీతేజ్ అనే పిల్లవాడు దాదాపు 20 రోజుల నుంచి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : December 24, 2024 / 08:40 PM IST

    Dil Raju 

    Follow us on

    Dil Raju  : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళాకాంతు ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంటు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన సంఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ మీద ఒక కేసు అయితే నమోదైంది. ఇక రేవతి అనే మహిళ మృతి చెందడం పట్ల యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్రమైన దిగ్బ్రాంతికు గురయ్యారనే చెప్పాలి…ఇక ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు సైతం ఈరోజు శ్రీ తేజ్ ని చూసి వాళ్ల నాన్నని పరామర్శించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుగు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్ డీసి) చైర్మన్ గా తనను నియమించడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే నియమించారని తను తెలియజేశాడు.

    మరి ఏది ఏమైనా కూడా శ్రీతేజ్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను తెలుగు సినిమా ఇండస్ట్రీ చూసుకుంటుందనే చెప్పాలి. అలాగే శ్రీ తేజ్ వాళ్ల నాన్నకి ఉపాధి కల్పించే విధానాన్ని కూడా మేము చూసుకుంటాం అంటూ ఆయన భరోసా ఇచ్చాడు. ఇక మొత్తానికైతే సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన అనేది అనుకోకుండా జరిగిందే తప్ప ఇందులో ఎవరి తప్పులేదు అంటూ ఆయన మాట్లాడాడు…

    ఇక మొత్తానికైతే దిల్ రాజు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. ఇక దిల్ రాజు కూడా సినిమా ఇండస్ట్రీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. కాబట్టి ఆయన కూడా ప్రొడ్యూసర్స్ సంఘం తరపున వాళ్లకు ఆర్థిక సహాయం అందించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరూ కలిసి వాళ్లకు రేవతి లేని లోటు తీర్చే విధంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే వాళ్లకు సంబంధించిన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఈ విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటై ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఇక వాళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది… అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దానిమీద కూడా తీవ్రమైన కసరత్తులు చేయాల్సిన అవసరమైతే ఉంది..