Dil Raju : సంధ్య థియేటర్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం తగ్గనుందా..?, శ్రీతేజ్ ని ఇండస్ట్రీ ప్రముఖులందరూ కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి కలిసి ఒక్కొక్కరుగా విరాళాలు అందించడం పట్ల రేవంత్ రెడ్డి సంతృప్తి చెందుతున్నాడా?, ఇండస్ట్రీ లో రాబోయే సినిమాలకు నేను సీఎం గా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోస్ కి, టికెట్ హైక్స్ ఇవ్వను అని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్నారా? అంటే ఆ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. నేడు ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజు కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ని కలిసి, అతని ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నాడు. అనంతరం శ్రీ తేజ్ కి అతని కుటుంబానికి సినీ ఇండస్ట్రీ అండగా ఉంటుంది అని మీడియా ముఖంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ శ్రీతేజ్ కి అన్ని విధాలుగా సాహసహకారాలు అందేలా మేము చూసుకుంటాము. ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి వారధి గా ఉండేందుకే సీఎం రేవంత్ రెడ్డి నన్ను తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ కి చైర్మన్ ని చేసారు. శ్రీ తేజ్ తండ్రి భార్గవ్ కి ఇండస్ట్రీ లో ఎదో ఒక పని ఇప్పించమని సీఎం గారు చెప్పారు. కచ్చితంగా ఆ పని మేము త్వరలోనే చెయ్యబోతున్నాము. సీఎం గారి ఆపాయిట్మెంట్ ని కూడా అడిగాను. ఆయన రేపు, లేదా ఎల్లుండి ఇస్తానని చెప్పారు. నాతో పాటు, ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖులందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాము’ అంటూ దిల్ రాజు ఒక కీలక ప్రకటన చేసాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అయితే తనతో పాటు ఎవరెవరు వస్తున్నారు అనేది మాత్రం దిల్ రాజు చెప్పలేదు.
సీఎం రేవంత్ రెడ్డి ని అల్లు అర్జున్ కలవబోతున్నాడా?:
ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రముఖులందరూ నాతో పాటు రాబోతున్నారు అంటే, ఆ ప్రముఖులలో అల్లు అర్జున్ కూడా ఉన్నాడా? అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. దిల్ రాజు ఇదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ త్వరలోనే అల్లు అర్జున్ ని కలవబోతున్నాను అని చెప్పుకొచ్చాడు. అంటే దిల్ రాజు సీఎం తో మీటింగ్ కి అల్లు అర్జున్ ని ఆహ్వానించేందుకే కలవబోతున్నాడా?, మరో రెండు రోజుల్లో అల్లు అర్జున్ బెయిల్ ని రద్దు చేస్తాము అంటూ హెచ్చరికలు వినిపిస్తున్న ఈ నేపథ్యం లో అల్లు అర్జున్ కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ని కలవబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అల్లు అర్జున్ రాలేకపోయిన, అతని తండ్రి అల్లు అరవింద్ వచ్చే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి మరి.