Rishabh Pant : రిషబ్ పంత్ సరిగా రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చావు చివరి అంచుల దాకా వెళ్లి వచ్చాడు. దాదాపు ఏడాది పాటు మంచానికి పరిమితమయ్యాడు. చివరికి తనను తాను నిరూపించుకున్నాడు. క్రికెట్ మీద ఇష్టంతో అహర్నిశలు శ్రమించాడు. శరీరం సహకరించకపోయినప్పటికీ.. పట్టుదలతో ముందుకు సాగాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ లో విపరీతంగా సాధన చేశాడు. నిష్ణాతులైన వైద్యుల వద్ద చికిత్స పొందాడు. చివరికి మైదానంలో అడుగు పెట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించి అదరగొట్టాడు. మొత్తంగా తనెంటో నిరూపించుకున్నాడు. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో లక్నో జట్టుకు వెళ్లిపోయాడు. సెకండ్ హైయెస్ట్ పేయిడ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
గొప్ప మనసు చాటుకున్నాడు
రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు కొంతమంది యువకులు అతడిని కాపాడారు. దీంతో వారు చేసిన సాయాన్ని గుర్తుంచుకున్న రిషబ్ పంత్.. ఆ యువకులకు బైక్ లు కానుకగా అందించాడు. వారు చేసిన సేవలను సామాజిక మాధ్యమాల వేదికగా కొనియాడాడు..” వారు లేకపోతే నేనులేను. నా జీవితాన్ని మరో మలుపు తిప్పారు. నన్ను సజీవుడిగా నిలిపారు. వారు చేసిన సాయం మర్చిపోలేనిది. వారికి ఎంత ఇచ్చినా తక్కువేనని” రిషబ్ పంత్ కొనియాడాడు. అయితే ఇప్పుడు రిషబ్ పంత్ మరో గొప్ప పని చేశాడు. మైదానంలో ఎంతో చలాకీగా రిషబ్ పంత్ ఉంటాడు. అందువల్లే అతనికి విపరీతమైన అభిమానులు ఉంటారు. అందులో ఓ దివ్యాంగ బాలిక కూడా ఉంది. రిషబ్ పంత్ అంటే ఆ బాలికకు చాలా ఇష్టం. ఆమె నడవలేకపోయినా.. అతడిని చూస్తే ఎక్కడా లేని సంతోషం వస్తుంది. ఆమెకు రిషబ్ పంత్ ను చూడాలని ఎప్పటినుంచే ఉంది. అయితే ఇన్ని సంవత్సరాలకు ఆమెకు ఆ కోరిక తీరింది. రిషబ్ పంత్ ను చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యానికి గురైంది. అతడిని చూడగానే శక్తిని కూడ తీసుకొని నడవడానికి ప్రయత్నించింది. చివరికి నడిచింది కూడా. ఆమెను చూసిన రిషబ్ పంత్ ఆనందానికి గురయ్యాడు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడాడు. ధైర్యంగా ఉండాలని సూచించాడు. కాళ్లు లేవని బాధపడకూడదని.. కచ్చితంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించాడు.” నువ్వు సమర్థవంతమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి. వైఫల్యం అనేది పెద్ద ఇబ్బంది కాదు. వైకల్యం కూడా ప్రతి బంధకం కాదు. గొప్పగా ఆలోచించుకోవాలి.. అప్పుడే నీకు మరింత ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడుతుంది.. ఆ తర్వాత మిగతావన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి.. వైకల్యం ఉందని బాధపడకు. సామర్థ్యాన్ని పెంచుకో. సమర్థతను అలవర్చుకో” అని పంత్ ఆ చిన్నారిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
తన 360 డిగ్రీల బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు క్రికెటర్ రిషబ్ పంత్ చుక్కలు చూపిస్తాడు. అటువంటి ఆటగాడు తనను ఎంతగానో ప్రేమించే ఓ దివ్యాంగ చిన్నారిని కలిశాడు.. ధైర్యంగా ఉండాలని ఆమెకు చెప్పాడు.#rishabhpanth#TeamIndia#Cricket pic.twitter.com/Q75nCrvIgu
— Anabothula Bhaskar (@AnabothulaB) December 24, 2024