నేడు తెలుగులో ఉన్నఅగ్ర నిర్మాతల్లో ఒకడైన దిల్ రాజు నిర్మాతగా మారి నేటికీ 17 ఏళ్ళు నిండాయి నితిన్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన `దిల్ ` మూవీ 2003 ఏప్రిల్ 4న విడుదలైంది. యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది
నిజానికి నితిన్ 2002 లో విడుదలైన `జయం` సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. నితిన్ కి ` దిల్ `రెండో చిత్రం. జయం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ తేజ , హీరోయిన్ సదా ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ లెక్కన నితిన్ ని హీరోగా నిలబెట్టిన చిత్రం దిల్ అనక తప్పదు. ఈ చిత్రం ద్వారా డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న రాజు నిర్మాత దిల్ రాజు అయ్యాడు. .కొన్ని సినిమాలు కొందరి జీవితాలలో భారీ మార్పులు తీసుకువస్తాయి. అలాంటి సినిమాల్లో దిల్ ఒకటి. నితిన్ని హీరోగా నిలబెట్టింది , అప్పటిదాకా పంపిణీదారుడిగా ఉన్న రాజు ని ` దిల్ రాజు `అనే బడా నిర్మాతగా మార్చింది. అలా నిర్మాతగా నిర్మించిన తొలి సినిమానే తన ఇంటి పేరు లాగా మార్చుకున్న దిల్ రాజు అసలు పేరు ఏమిటో తెలుసా వంగా వెంకట రమణారెడ్డి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Dil raju seventeen years completes as a producer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com