Trivikram: త్రివిక్రమ్ చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒక పెద్ద రైటర్ అనే విషయం మీకు తెలుసా..?

Trivikram: త్రివిక్రమ్ తోపాటు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న మరొక వ్యక్తి కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో రైటర్ గా సూపర్ సక్సెస్ ని సాధించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు.

Written By: Gopi, Updated On : June 19, 2024 12:11 pm

Trivikram childhood best friend is also a great writer

Follow us on

Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్..ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో రైటర్ గా కూడా తను సూపర్ సక్సెస్ ని సంపాదించాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆ తర్వాత డైరెక్టర్ గా మారి కూడా వరుసగా హిట్స్ ను అందుకున్నాడు. ఇక త్రివిక్రమ్ తోపాటు చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న మరొక వ్యక్తి కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో రైటర్ గా సూపర్ సక్సెస్ ని సాధించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు.

అయితే ఆయన ఎవరు అంటే డైలాగ్ రైటర్ ‘అబ్బూరి రవి’… చిన్నప్పటి నుంచి త్రివిక్రమ్ అబ్బురి రవి ఇద్దరు క్లాస్ మెట్స్ అవ్వడమే కాకుండా ఇద్దరికీ చిన్నప్పటి నుంచి రైటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే దొరికిన బుక్కుని వదలకుండా చదువుతూ ఉండేవారట. అలా వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడడమే కాకుండా సినిమాల మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో ఇద్దరు కలిసి చాలా సినిమాలు చూసేవారు. ఇక మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీకి వచ్చి రైటర్ గా సెటిల్ అయిన తర్వాత అబ్బూరి రవి ఇండస్ట్రీకి వచ్చాడు. ఆయనకు కథ మాటలు ఎలా రాయాలి అనేది కూడా త్రివిక్రమ్ చెప్పడం విశేషం…

Also Read: Kalki 2898 AD: కల్కి రిలీజ్ డేట్ వచ్చేస్తుంది..మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి..?

ఇక ఆ తర్వాత అబ్బురి రవి కూడా రైటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన కెరియర్లో బొమ్మరిల్లు,కిక్, ఎవడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలబు చేశాడు. ఇక తన మాటలతో సినిమా సక్సెస్ అవ్వడంలో చాలా వరకు హెల్ప్ చేశాడు…ఇక మొత్తానికైతే చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.. ఇక అబ్బురి రవి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన కూడా త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ త్రివిక్రమ్ వల్లే తను కూడా ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నానని చెబుతుంటాడు.

Also Read: Sai Pallavi: బెస్ట్ డాన్సర్ సాయి పల్లవి ట్రై చేసిన చిరంజీవి స్టెప్ ఏమిటో తెలుసా? ఆ మూమెంట్ అంటే మహా ఇష్టం అట!

ఎందుకంటే మొదట్లో అబ్బూరి రవి సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనకు అంత గందరగోళంగా ఉండేదట ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియకపోవడంతో త్రివిక్రమ్ తన దగ్గర కూర్చోబెట్టుకొని మరి ఆయనకు స్క్రిప్ట్ రాయడం ఎలాగో వివరించారట. అప్పటి నుంచి ఆయన సినిమాలను ఎలా రాయాలి, ఏం చేయాలనే దాని మీద ఒక క్లారిటీ రావడంతో ఇప్పటి వరకు కూడా నేను రైటర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని చెప్పాడు…