https://oktelugu.com/

Kalki 2898 AD: కల్కి రిలీజ్ డేట్ వచ్చేస్తుంది..మరి ఈ సినిమా పరిస్థితి ఏంటి..?

ముంబైలో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈ సినిమాలో నటించిన అమితాబచ్చన్, కమలహాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే లాంటి స్టార్లు హాజరవుతున్నారు. ఇక మొదటిసారి ఈ స్టార్లు అందరు కూడా స్టేజ్ మీద కనిపించబోతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 19, 2024 / 11:50 AM IST

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD: ప్రభాస్ మరోసారి కల్కి సినిమాతో ఇండియా వైడ్ గా ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయం లో ఈ మూవీ కి సంభందించిన కౌంట్ డౌన్ మొదలైంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా విషయంలో రోజుకొక అప్డేట్ రావడం తో ప్రేక్షకులు చాలా అనందపడుతున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో నాగ్ అశ్విన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా రిలీజ్ చేస్తూ సినిమా మీద హైప్ ను అయితే పెంచుతున్నారు. ఇక రీసెంట్ గా నాగ్ అశ్విన్ ఈ సినిమా స్టోరీ గురించి వివరిస్తూ చేసిన వీడియో సినిమా ప్రమోషన్ కి చాలా బాగా వర్కవుట్ అయింది.

    ఇక 19 తేదీన ముంబైలో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈ సినిమాలో నటించిన అమితాబచ్చన్, కమలహాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే లాంటి స్టార్లు హాజరవుతున్నారు. ఇక మొదటిసారి ఈ స్టార్లు అందరు కూడా స్టేజ్ మీద కనిపించబోతున్నారు. కాబట్టి దానికోసం చాలామంది అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాక ఈ సినిమా మీద అంచనాలు మరింత భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

    ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో సక్సెస్ ఫుల్ గా గా జరిగితే మాత్రం బాలీవుడ్ హీరోలందరికీ చెమటలు పట్టే అవకాశాలైతే ఉన్నాయి.
    ఎందుకంటే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇంతకుముందు సలార్ సినిమాతో భారీ సక్సెస్ ను సంపాదించుకున్న ప్రభాస్ మరోసారి ఈ సంవత్సరం కూడా అదే జోష్ ని ప్రదర్శించబోతున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్, ట్రైలర్, బుజ్జి అండ్ భైరవల యానిమేషన్ వీడియో కూడా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన విజయకేతనాన్ని ఎగరవేయబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది…చూడాలి మరి ప్రభాస్ ఆశించిన విజయాన్ని ఈ సినిమా అందిస్తుందా లేదా అనేది…