https://oktelugu.com/

Sai Pallavi: బెస్ట్ డాన్సర్ సాయి పల్లవి ట్రై చేసిన చిరంజీవి స్టెప్ ఏమిటో తెలుసా? ఆ మూమెంట్ అంటే మహా ఇష్టం అట!

Sai Pallavi: డాన్స్ అంటే ఇష్టపడే అమ్మాయిగా సాయి పల్లవి చిరంజీవిని ఎంతగానో అభిమానించేవారట. అలాగే ఆయన పాటల్లోని ఐకానిక్ స్టెప్స్ ఆమె ట్రై చేసేవారట.

Written By: , Updated On : June 19, 2024 / 11:13 AM IST
Do you know the Chiranjeevi step that Sai Pallavi tried

Do you know the Chiranjeevi step that Sai Pallavi tried

Follow us on

Sai Pallavi: సాయి పల్లవి ఈ తరం బెస్ట్ డాన్సర్స్ లో ఒకరు. ఫిదా చిత్రంలోని ‘వచ్చిండే’ సాంగ్ కి సాయి పల్లవి వేసిన స్టెప్స్ అద్భుతంగా ఉంటాయి. మారి 2 లోని ‘రౌడీ బేబీ’ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. లవ్ స్టోరీ చిత్రంలోని ‘సారంగదరియా’ సాంగ్ సైతం ఆడియన్స్ ని షేక్ చేసింది. సాయి పల్లవి సాంగ్స్ కి యూట్యూబ్ లో ఓ క్రేజ్ ఉంది. ఆమె సాంగ్స్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టాయి. ఇక టాలీవుడ్ లో డాన్స్ అంటే గుర్తుకు వచ్చే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ విషయంలో ఆయన ట్రెండ్ సెట్టర్.

డాన్స్ అంటే ఇష్టపడే అమ్మాయిగా సాయి పల్లవి చిరంజీవిని ఎంతగానో అభిమానించేవారట. అలాగే ఆయన పాటల్లోని ఐకానిక్ స్టెప్స్ ఆమె ట్రై చేసేవారట. చిరంజీవి వేసిన స్టెప్స్ లో తనకు ఇష్టమైనది ఏదో ఒక సందర్భంలో సాయి పల్లవి వెల్లడించింది. చిరంజీవితో డాన్స్ వేయడానికి మీరు నిరాకరించారట కదా… అని యాంకర్ అడగ్గా, అది నిజం కాదని అన్నారు. నేను ఆయన నటిస్తున్న భోళా శంకర్ చిత్రాన్ని రిజెక్ట్ చేశాను. కారణం అది ఒక రీమేక్. నేను రీమేక్స్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపను. పోలికలు వస్తాయి. అందుకే నేను భోళా శంకర్ మూవీ చేయను అని చెప్పాను… అన్నారు.

Also Read: Pawan Kalyan: వెంకటేష్ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?

సాయి పల్లవి ఇంకా మాట్లాడుతూ.. చిరంజీవి డాన్సులలో అద్భుతమైన గ్రేస్ ఉంటుంది. ముఠామేస్త్రి చిత్రంలోని ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ పాటలో ఆయన వేసే ఓ స్టెప్ నాకు చాలా ఇష్టం. చాలా సార్లు ఆ స్టెప్ నేను ట్రై చేశాను. ఆ పాటలో చిరంజీవి డాన్సులో గ్రేస్ మామూలుగా ఉండదు. హిట్లర్ చిత్రంలోని ‘నడక కలిసిన నవరాత్రి’, ముగ్గురు మొనగాళ్లు చిత్రంలోని ‘చామంతి పువ్వా’ సాంగ్స్ లోని చిరంజీవి డాన్స్ నాకు చాలా ఇష్టమని అన్నారు.

Also Read: Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ అంత కలిసి మరో సినిమా చేయబోతున్నారా..?

లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన చిరంజీవి తన చిత్రంలో నటించేందుకు సాయి పల్లవి నో చెప్పిందని స్వయంగా వెల్లడించారు. సాయి పల్లవి రిజెక్ట్ చేసిన ఆ పాత్రను కీర్తి సురేష్ చేసింది. కాగా భోళా శంకర్ ఫలితం నిరాశపరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్యకు జంటగా తండేల్ మూవీ చేస్తుంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది.

Mutamestri Telugu Movie | Ee Petaku Nene Mestri Video Song | Chiranjeevi | Silk Smitha | Raj Koti