https://oktelugu.com/

Junior NTR : సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా ఎన్టీయార్ వల్లే ప్లాప్ అయిందనే విషయం మీకు తెలుసా..?

ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు మంచి కథలను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రేక్షకుడి ఐడియాలజీ మారిపోయింది. వరల్డ్ సినిమాను చూసే స్థాయికి ప్రేక్షకుడు ఎదిగాడు. కాబట్టి మన సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండాలని మనవాళ్లు భావిస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 9, 2024 / 11:13 AM IST

    Junior NTR

    Follow us on

    Junior NTR :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కి చాలా ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. ఆయన నటనలో గాని, డ్యాన్స్ లో గాని తనను తాను ప్రూవ్ చేసుకొని సగటు ప్రేక్షకుడితో శభాష్ అనిపించుకునేలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమా తనకు గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి ఒక మంచి పోటీని అయితే ఇస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన దేవర సినిమా భారీ సక్సెస్ ని సాధించి కలెక్షన్ల సునామిని సృష్టిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఆయన వరుస సినిమాలను చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడు. ఒకేసారి రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టి వరుసగా సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక సంవత్సరానికి రెండు సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్టీయార్ తను అనుకున్నట్టుగానే సంవత్సరానికి రెండు సినిమాలను రిలీజ్ చేస్తాడా? లేదా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆయన చేస్తున్న డైరెక్టర్లు లైనప్ కనుక చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి.

    ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ చేసిన ఒక సినిమా బాగున్నప్పటికీ ఆ సినిమా ఎన్టీఆర్ వల్లే ఫ్లాప్ అయిందనే విషయం మనలో చాలామందికి తెలియదు. నిజానికి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘ఊసరవెల్లి ‘ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటుంది.

    కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దానికి కారణం ఏంటి అంటే అప్పటికే ఎన్టీఆర్ మాస్ హీరోగా మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. కాబట్టి అది ఎన్టీఆర్ స్టోరీ కాకుండా హీరోయిన్ స్టోరీ లోకి ఎన్టీఆర్ ఎంటర్ అవ్వడం అనేది అప్పటి ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. ఇక ఎన్టీయార్ కి సరైన కథ లేకపోవడంతో సగటు ప్రేక్షకుడు ఆ సినిమాని జీర్ణించుకోలేకపోయాడు. అందువల్లే ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఇమేజ్ వల్లే ఆ సినిమా భారీ ఫ్లాప్ ని మూటగట్టుకుందనే చెప్పాలి.

    తన ఇమేజ్ కి సరిపడా కథను ఎంచుకోకపోవడం ఎన్టీఆర్ చేసిన తప్పంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం అప్పట్లో భారీ విమర్శలైతే చేశారు… ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగడం అనేది ఆయన అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తుంది…