Dhanush: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల పరిస్థితి కూడా ఇలానే ఉంది. వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి తమను తాము స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే పాన్ ఇండియాలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్లు సైతం సక్సెస్ ల కోసం పరిగెడుతూ ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి హీరో చాలా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన రజనీకాంత్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన అల్లుడు అయిన ధనుష్ మాత్రం స్టార్ హీరోగా మారలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగానే కథలను ఎంచుకొని ముందుకు సాగుతున్నాడు. నిజానికి ఆయనకి స్టార్ హీరోల కంటే కూడా చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. కానీ ఒక రకంగా చూసుకుంటే మాత్రం ఆయనకు మిగతా హీరోలతో పోలిస్తే చాలా తక్కువ మార్కెట్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఎంచుకునే పాయింట్స్ చాలా యూనిక్ గా ఉంటాయి. అవి ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చితే మరి కొంతమందికి నచ్చకపోవచ్చు.
కానీ ఆయన అటెంప్ట్ మాత్రం చాలా జెన్యూన్ గా ఉంటుంది. అందువల్లే ఆయన మాస్ హీరోగా ఎదగలేక భారీ సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు… నిజానికి ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లు మన వెనకాల ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు మాస్ సినిమాలు చేసి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తారు.
కానీ ధనుష్ మాత్రం దానికి భిన్నంగా వెళుతున్నాడు. అందువల్లే ఆయనకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. ఇక ప్రేక్షకుల నుంచి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా ఎక్కువగా దక్కుతున్నాయి. స్టార్ హీరో రేంజ్ ను అందుకోవడం కంటే ఒక మంచి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే తనకు ముఖ్యమంటూ ఒకానొక సందర్భంలో ధనుష్ చెప్పిన విషయాలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి.
అందువల్లే ఆయన చిన్న దర్శకులతో సైతం సినిమాలు చేస్తు వాటిని భారీ సక్సెసులుగా మలుస్తున్నాడు. ఇక ప్రస్తుతం తెలుగు మార్కెట్ మీద కన్నేసిన ఆయన ఇప్పుడు శేఖర్ కమ్ములతో చేస్తున్న కుబేర సినిమాతో భారీ సక్సెస్ కొడతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…