https://oktelugu.com/

New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. వారికి సైతం పునరుద్ధరించే ఛాన్స్!

సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలకు రేషన్ కార్డులు తప్పనిసరి. అయితే గత ఏడాది కాలంగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో లక్షలాదిమంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అటువంటి వారి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మంత్రివర్గ సమావేశంలో ఫైనలైజ్ చేయనుంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 9, 2024 / 11:14 AM IST

    New Ration Cards

    Follow us on

    New Ration Cards: ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది.కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న వారికి శుభవార్త చెప్పింది. త్వరలోనే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించారు.అనర్హుల కార్డులను తొలగిస్తూనే.. గతంలో అర్హత ఉన్నాకార్డు రద్దు అయిన వారికి పునరుద్ధరించాలని నిర్ణయించారు. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ఆమోదం తెలపనున్నారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది.వైసిపి ప్రభుత్వం జనవరి, జూన్లో కొత్త కార్డులను మంజూరు చేసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది తమకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దానిపై కదలిక వచ్చింది.కొత్త కార్డుల జారీ తో పాటుగా ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు, చేర్పులకు సంబంధించి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే చాలామంది లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.అటు చేర్పులు మార్పులకు సైతం అవకాశం ఇవ్వనుండడంతో చాలామందికి ప్రయోజనం చేకూరనుంది.

    * పథకాలకు తప్పనిసరి
    ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి. రేషన్ కార్డు ఉంటేనే పథకాలు దక్కుతాయి. అందుకే ఎక్కువ మంది రేషన్ కార్డుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు, పట్టణ ప్రాంతాల్లో 12 వేలకు ఆదాయం మించితే రేషన్ కార్డుకు అర్హులు కాదని గత ప్రభుత్వం స్పష్టం చేసింది.అలానే అమలు చేసింది. అంగన్వాడీ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు సైతం రేషన్ కార్డులను రద్దు చేసింది.దీంతో వారు ఎటువంటి పథకాలు పొందేందుకు అవకాశం లేకుండా పోయింది.

    * మినహాయింపులకు విజ్ఞప్తి
    అయితే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియను విషయంలో మినహాయింపులు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కుటుంబ ఆదాయ పరిమితి పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దీంతో ఈ అంశంపై చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అనర్హులకు రేషన్ కార్డులు మంజూరైనట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అందుకే కొత్తవి మంజూరు చేస్తూనే అనర్హుల కార్డులు తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇక రేషన్ సరఫరా చేసి వాహనాల వినియోగంపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను భర్తీ చేయడంతో పాటు వాహనాల విషయంలో ఎలా ఉపయోగించాలి అన్నదానిపై రేపు మంత్రివర్గంలో చర్చించనున్నారు. మొత్తానికి అయితే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ విషయంలో కదలిక రావడంతో.. లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.