Hollywood director : సినిమా ఇండస్ట్రీలో చాలామంది సినిమాలు తీస్తూ ఉంటారు. కొంతమంది తీసిన సినిమాలు సక్సెస్ అవుతుంటే, మరి కొంతమంది తీసిన సినిమాలు మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటాయి. ఇక ఇంకొంతమంది తీసిన సినిమాలు మాత్రం క్లాసికల్ మారుతూ ఉంటాయి. ఇక చాలా జనరేషన్లకి ఆ సినిమాలు గుర్తుండిపోయేలా ఆ సినిమాను తీర్చిదిద్దుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే హాలీవుడ్ డైరెక్టర్ అయిన “అల్ఫ్రెడ్ హిచ్ కాక్” ఒకరు. ఈయన తీసిన సైకో సినిమా అప్పట్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించిందనే చెప్పాలి.
ఇక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేయాలి అనుకున్న ప్రతి ఒక్క దర్శకుడికి ఈయనే గుర్తొస్తాడు. ఈయన చేసిన సైకో సినిమాను కనక మనం చూసినట్లైతే ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్త అంశంతో కూడిన కథలను రాసుకొని సినిమాలు తీస్తూ ఉంటాడు. ఆయన 1960 వ సంవత్సరంలోనే సైకో అనే సినిమా తీశాడు. ఆ సినిమాను బేస్ చేసుకొని ఇప్పటికీ వరకు చాలా తెలుగు సినిమాలు వచ్చాయి.
అందులో ముఖ్యంగా రాంగోపాల్ వర్మ తీసిన చాలా సినిమాలకి ఈయన కథలనే ఇన్స్పిరేషన్ గా వాడుతూ ఉంటాడు. తెలుగులో ఒక థ్రిల్లర్ సినిమా వస్తుంది అంటే పక్కగా వాళ్ళు సైకో సినిమాలో నుంచి ఏదో ఒక పాయింట్ అయితే తీసుకుని ఉంటారు అనేంతలా ఈ సినిమా పాపులారిటీ ని సంపాదించుకుంది. ఇక నిజానికి ఈ సినిమాని అప్పుడే ఆయన చాలా అడ్వాన్సుడ్ గా ఆలోచించి స్క్రిప్ట్ రాసుకొని సినిమా చేశారు. ఇక ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ ను “మాస్టర్ ఆఫ్ సస్పెన్స్” అని కూడా పిలుస్తుంటారు. ఈయన సినిమాను షూట్ చేసేటప్పుడు సినిమా క్లైమాక్స్ ఏంటి అనేది ఆర్టిస్ట్ లకి కూడా చెప్పకుండా తను మాత్రమే ఒంటరిగా తెరకెక్కిస్తూ ఉండేవాడట.
అందువల్లే స్టోరీ అనేది అందులో నటించే నటీనటులకు కూడా పూర్తిగా తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటు ఉండేవాడట. ఎందుకంటే వాళ్లు కూడా ఆ సినిమాను చూసినప్పుడు థ్రిల్ అయ్యేవిధంగా స్టోరీ రాసుకుంటూ ట్విస్ట్ లు ఎక్కడ రివిల్ అవ్వకుండా చూసుకుంటూ ఉండేవాడట. ఇక అందువల్లే ఆయన సినిమాలకి హాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ అయితే ఉంది. ఇక ఈయన 1899 వ సంవత్సరం లో లండన్ లో జన్మించాడు. ఇక 1980 వ సంవత్సరంలో అమెరికా లో మరణించారు…