Telugu Thriller Movies : థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అయితే ఇలాంటి సినిమాలు తీయడం అంత సులభం కాదు. మొదటినుంచి చివరి వరకు ప్రేక్షకులు ఊహకి అందకుండా దర్శకుడు కథ కథనాన్ని సాధించాలి. అందుకే అన్ని జోనర్స్ లోకి థ్రిల్లర్ తీయడం అనేది ఎక్కువ కష్టమైన పని. అయితే మన తెలుగులో అలాంటి సినిమాలు తీసి సక్సెస్ అయిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. మరి ప్రేక్షకులకు ఎంతగానో మెప్పిచ్చిన టాప్ సెవెన్ ఉత్తమ తెలుగు థ్రిల్లర్ సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం..
క్షణక్షణం
అప్పట్లో ఎలాంటి సినిమా అయినా తీయడంలో రాంగోపాల్ వర్మ కి ప్రత్యేక స్థానం ఉండేది. ఇక ఆయన నుంచి వచ్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో క్షణక్షణం ఒకటి. ఈ సినిమా సత్య (శ్రీదేవి) అనే యువతి, చందు (వెంకటేష్) అనే చిన్న దొంగ మధ్య సాగే థ్రిల్లర్. ఈ చిత్రంలో సస్పెన్స్, యాక్షన్, రొమాన్స్ అంశాలు అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మరో హైలెట్.
అనుకోకుండా ఒక రోజు
చార్మి కెరియర్ లో మర్చిపోలేని సినిమా ఇది. తక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి ఎక్కువ కలెక్షన్ సాధించింది ఈ సినిమా. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన, “అనుకోకుండా ఒక రోజు” ఒక నియో-నోయిర్ థ్రిల్లర్. ఈ సినిమా కథ సహస్ర (చార్మీ కౌర్) అనే యువతి జీవితంలో అనుకోకుండా ఒకరోజు ఏమి జరిగింది అనే దాని చుట్టూ తిరుగుతుంది. నాన్-లీనియర్ కథనం, ఉత్కంఠభరితమైన కథాంశంతో, చిత్రం చివరి వరకు ప్రేక్షకులను థ్రిల్లర్ కి గురి చేస్తుంది.
ఎవరు
వెంకట్ రామ్‌జీ దర్శకత్వం వహించిన “ఎవరు” నియో-నోయిర్ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా కథ మొత్తం కూడా అనుకోని మలుపులతో ప్రేక్షకులను వారి సీట్ల అంచున ఉంచుతుంది. హత్య విచారణ, వెలుగులోకి వచ్చిన ఊహించని విషయాలు చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా కథ. గట్టి స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనం, అడివి శేష్, రెజీనా కసాండ్రా యొక్క ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్.
నేనొక్కడినే
సుకుమార్ దర్శకత్వం వహించిన “నేనొక్కడినే” సైకలాజికల్ థ్రిల్లర్. భ్రమలతో బాధపడుతున్న గౌతమ్ (మహేష్ బాబు) అనే రాక్ సంగీతకారుడి జీవితం చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా. గౌతమ్ తన గతం వెనుక ఉన్న నిజాన్ని వెతికే ప్రయత్నం, ప్రేక్షకులను మైండ్ బెండింగ్ జర్నీలోకి తీసుకువెళుతుంది.
యు టర్న్
పవన్ కుమార్ దర్శకత్వం వహించిన “యు టర్న్” ఒక జర్నలిస్ట్ (సమంత అక్కినేని) చుట్టూ తిరిగే ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఈ సినిమా ఒక యు-టర్న్ వద్ద జరుగుతున్న రహస్య మరణాల ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఊహించని మలుపులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
-విరూపాక్ష
సాయిధరమ్ తేజ్ హీరోగా ఇటీవలే వచ్చిన ‘విరూపాక్ష’ అల్టిమేట్ క్రైం థ్రిల్లర్ గా చెప్పొచ్చు. ఈ సినిమా అందరినీ భయపెట్టింది. కాసుల వర్షం కురిపించింది. మంత్రాలు, తంత్రాల చుట్టూ సాగిన ఈ మూవీ భయపెట్టింది.
ఇవే కాకుండా తెలుగులో ఐతే, ఏ ఫిల్మ్ బై అరవింద్, అనుకోకుండా ఒకరోజు (2005), కార్తికేయ, దృశ్యం, అనామిక, రాక్షసుడు, వీ, హిట్ సినిమా ఉత్తమ తెలుగు థ్రిల్లర్ మూవీస్ గా చెప్పొచ్చు.