Tollywood Heroines: ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దగలిగే కెపాసిటి దర్శకులకు మాత్రమే ఉంటుంది. ఆర్టిస్టులు ఎంత బాగా యాక్టింగ్ చేసిన కూడా కథలో దమ్ము ఉండాలి. ఇక దర్శకుడు ఆ సినిమాని పర్ఫెక్ట్ డైరెక్షన్లో ముందుకు తీసుకెళ్లినప్పుడే సినిమాలు బ్లాక్ బాస్టర్లు గా మారుతాయి… సినిమా మొత్తం దర్శకులు చెప్పినట్టుగానే నడుస్తోంది. కాబట్టి హీరోయిన్లు సైతం దర్శకులకు సరెండర్ అయిపోయి యాక్టింగ్ చేయాలని చూస్తుంటారు. ఇక ఈ క్రమంలో హీరోయిన్లకు దర్శకులకు మధ్య ప్రేమ చిగురుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. అప్పటి వరకు దర్శకులకు పెళ్లి అవ్వకుండా బ్యాచిలర్స్ గా ఉండి హీరోయిన్స్ ను పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఆల్రెడీ వాళ్ళకి పెళ్లి అయి, పిల్లలు ఉంటే మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
కొంతమంది హీరోయిన్లు దర్శకులను ప్రేమించడం వల్ల డైరెక్టర్స్ వాళ్ల భార్య లకు విడాకులు ఇచ్చి హీరోయిన్స్ ను సెకండ్ మ్యారేజ్ లు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి క్రమం లోనే ప్రభుదేవా లాంటి స్టార్ కొరియోగ్రాఫర్ దర్శకుడిగా మారి సినిమాలను చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక తనతో నయనతార లవ్ ఎఫైర్ అయితే నడిపింది. నయనతార ను పెళ్లి చేసుకుంటానని భావించిన ప్రభుదేవా తన భార్య కి విడాకులిచ్చి, పిల్లల్ని వదిలేశాడు.
కానీ చివరి నిమిషంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం వల్ల ఎవరికి వాళ్లు సపరేట్ అయిపోయారు. ఇక మొత్తానికైతే నయనతార విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది… నయనతార వల్లే ప్రభుదేవా తన వైఫ్ కి విడాకులు ఇచ్చాడు. ఆ ఫ్యామిలీ మొత్తం చెల్లాచెదురు అయిపోయిందనే చెప్పాలి… ఇక రీసెంట్ గా సమంత సైతం రాజ్ నిడిమోరు ను పెళ్లి చేసుకుంది. ‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ తో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఈ దర్శకుడితో ప్రేమలో పడిన సమంత మొదట తను నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది.
ఆ తర్వాత రాజ్ నిడిమోరు ను సైతం తన భార్యకు విడాకులు ఇవ్వమని చెప్పి రీసెంట్ గా తనను రెండో పెళ్లి చేసుకుంది. మొత్తానికైతే రాజ్ నిడిమోరు సమంత వల్ల తన వైఫ్ కి విడాకులు ఇచ్చాడు. ఇలా హీరోయిన్లు దర్శకులను ప్రేమలో పడేసుకొని వాళ్ల ఫ్యామిలీని వాళ్ళకు దూరం చేస్తూన్నారు…ఇక ఇదంతా చూసిన ప్రేక్షకులు మాత్రం ఈ హీరోయిన్స్ కి పెళ్ళైన డైరెక్టర్లే దొరుకుతున్నారా? పెళ్లి కానీ డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటున్నారు…