Team India : బుమ్రాని రోహిత్ వాడుకునే పద్ధతితో మంచి ఫలితాలు.. పాతతరం వారికి ఈ కొత్త గేమ్ అర్థం కావట్లేదా?

Team India ఇలా సీనియర్ ఆటగాళ్లు లేనిపోని విమర్శలు చేస్తే ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కపిల్, సునీల్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేసినప్పటికీ రోహిత్ నిశ్శబ్దంగా ఉండడం విశేషం.

Written By: NARESH, Updated On : June 14, 2024 11:22 am

Tips on using Jasprit Bumri by Rohit Sharma

Follow us on

Team India : మైదానంలో ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల కంటే.. కెప్టెన్ పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగతంగా అతడు ఆడాలి, ఇతర ఆటగాళ్లతో ఆడించాలి. మ్యాచ్ గెలిచేందుకు రకరకాల ప్రణాళికలు రూపొందించాలి. అయితే అన్నిసార్లు ఈ ప్రణాళికలు సఫలీకృతం అవుతాయని చెప్పడానికి లేదు.. అంతమాత్రాన కెప్టెన్ ను తప్పు పట్టడానికి లేదు. ఆటగాళ్లను నిందించడానికి లేదు. కానీ, మనదేశంలో మాజీ క్రికెటర్లు అదేపనిగా రోహిత్ శర్మను నిందిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..

ప్రస్తుతం టీమిండియా టి20 వరల్డ్ కప్ ఆడుతోంది. గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్, ఐర్లాండ్, అమెరికా పై గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించింది.. టి20 వరల్డ్ కప్ రేసులో ముందు వరుసలో ఉంది.. అయితే ఈ మూడు మ్యాచ్ ల క్రమంలో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ జస్ ప్రీత్ బుమ్రా తో తొలి ఓవర్ వేయించలేదు.. అయితే ఇది టీ మీడియా మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కు తప్పు లాగా కనిపిస్తోంది.. అదేదో ఘోర తప్పిదం లాగా వారికి అనిపిస్తోంది..

ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ జస్ ప్రీత్ బుమ్రా తో ప్రారంభం ఓవర్ వేయించలేదు. దీనిని సునీల్ గవాస్కర్ తీవ్రంగా తప్పుపట్టాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. “రోహిత్, విరాట్ కోహ్లీ తమ బ్యాటింగ్ శైలి మార్చుకోరు కదా” అంటూ సునీల్ గవాస్కర్ నిలదీశాడు. జస్ ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలర్ కాబట్టి.. అతడితో ముందుగానే బౌలింగ్ చేయించాలి. కొద్దిరోజులుగా భారత క్రికెట్లో బౌలర్లు గెలుపు ఘనతను అందుకుంటున్నారు.. ఇది అత్యంత అరుదైన సందర్భం. ఈ మ్యాచ్లో జస్ ప్రీత్ బుమ్రా ముందుగా బౌలింగ్ వేస్తాడని భావించా. అని మూడో ఓవర్ ఇచ్చారు.. అత్యుత్తమ బౌలర్ గా పేరుపొందిన అతడికి తొలి ఓవర్ ఎందుకు ఇవ్వలేదు.. 12 బంతులు వృధా అయిన తర్వాత బౌలింగ్ ఎందుకు ఇస్తారు” అని సునీల్ గవాస్కర్ విమర్శించాడు. ఇక కపిల్ దేవ్ సైతం రోహిత్ శర్మను నిలదీశాడు. ” వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న ఆటగాడిని అలా చేయడం దేనికి.. అలా మూడో బౌలింగ్ ఇస్తే భారత్ మ్యాచ్ ఓడిపోతుంది కదా.. ఇది అతడికి అర్థం కావడం లేదా.. అది టెస్ట్ కాదు, టి20 ఫార్మాట్.. ముందుగానే వికెట్లు పడగొడితే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెరుగుతుందని” కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.

వాస్తవానికి జస్ ప్రీత్ బుమ్రా
నెంబర్ వన్ బౌలర్ అయినప్పటికీ.. అన్నిసార్లు అతనితో బౌలింగ్ చేయించడం కుదరకపోవచ్చు. మైదానంలో పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ వేయించాల్సి ఉంటుంది. పైగా అమెరికన్ మైదానాలు ప్రారంభించి బౌలింగ్ కు అనుకూలంగా మారుతున్నాయి. ఉదాహరణకు అమెరికాతో జరిగిన మ్యాచ్ చూసుకుంటే అందులో అర్ష్ దీప్ సింగ్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అమెరికన్ ఆటగాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. అలాంటప్పుడు రోహిత్ నిర్ణయం సరైనదే కదా.. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ రోహిత్ జస్ ప్రీత్ బుమ్రా ముందుగా కాకుండా కీలకమైన ఓవర్లలో బౌలింగ్ వేయించి ఫలితం రాబట్టాడు. ముఖ్యంగా బాబర్ అజాం, రిజ్వాన్, ఫకార్ ను బోల్తా కొట్టించాడు. ముఖ్యమైన సమయంలో బౌలింగ్ వేయించడం ద్వారా రోహిత్ జస్ ప్రీత్ బుమ్రా తో ఫలితం రాబట్టాడు. కానీ ఈ విషయం సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కు అర్థం కావడంలేదని రోహిత్ అభిమానులు అంటున్నారు.. ఇలా సీనియర్ ఆటగాళ్లు లేనిపోని విమర్శలు చేస్తే ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కపిల్, సునీల్ ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేసినప్పటికీ రోహిత్ నిశ్శబ్దంగా ఉండడం విశేషం.