Shankar Bharateeyudu 2: ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ అంచనాలతో భారతీయుడు 2 అనే సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ అద్భుతంగా ఉన్నప్పటికీ సినిమా ఎలా ఉంటుంది అనేదాని మీదనే ప్రస్తుతం ప్రతి ఒక్క అభిమాని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే 1996లో శంకర్ డైరెక్షన్ లో కమలహాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు 2 సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు.
ఇక భారతీయుడు 2 సినిమాలో సేనాపతి క్యారెక్టర్ ని హైలెట్ చేస్తూ ఈ సినిమా మొత్తాన్ని చిత్రీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ ని తీసుకున్న శంకర్.. భారతీయుడు 2 లో మాత్రం అనిరుధ్ ను తీసుకున్నాడు. ఇక ఆయన ఇచ్చిన మ్యూజిక్ అంత ఇంపాక్ట్ చూపించినట్టుగా అయితే అనిపించడం లేదు.
Also Read: Bharateeyudu 2: భారతీయుడు 2 కోసం కమలహాసన్ అంత కష్టపడ్డడా..? లోక నాయకుడు అంటే ఊరికే అయిపోరూ కదా..
మరి ఈ సినిమా కూడా రెహమాన్ తోనే చేస్తే బాగుండేది అంటూ శంకర్ అభిమానులు కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక అనిరుధ్ విక్రమ్, జైలర్, లియో వంటి సినిమాలకు ఎలాంటి మ్యూజిక్ అయితే ఇచ్చాడో ప్రస్తుతం ఆయన అలాంటి మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోతున్నాడు. కాబట్టి అతన్ని పక్కన పెట్టి ఏ ఆర్ రెహమాన్ ని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకుంటే బాగుండేది అని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
Also Read: Game Changer: శంకర్ గేమ్ చేంజర్ కి లైన్ క్లియర్…టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే…
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో ఆయన మ్యూజిక్ ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించినట్టుగా కనిపించడం లేదు…ఇక మొత్తానికైతే అనిరుధ్ గ్రాఫ్ అనేది ఒక్కసారిగా భారీ స్థాయిలో పెరిగింది. ఇక ఇప్పుడు దేవర, భారతీయుడు 2 సినిమాలతో ఆయన కనక ఏదైనా మ్యాజిక్ చేస్తేనే ఆయన క్రేజ్ అనేది భారీ లెవెల్లో పెరుగుతుంది. లేకపోతే మాత్రం భారీ లెవెల్ నుంచి కిందకి జారిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…