https://oktelugu.com/

Bharateeyudu 2: భారతీయుడు 2 లో సిద్ధార్థ్ చనిపోతాడా..? అసలు కథేంటి..?

Bharateeyudu 2: సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో సిద్ధార్థ్ కీలకమైన పాత్రలో నటించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన పోషించిన పాత్ర ఈ సినిమాకి దిశ నిర్దేశాన్ని సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 26, 2024 / 09:58 AM IST

    Siddharth will die in Bharateeyudu 2

    Follow us on

    Bharateeyudu 2: కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టు గానే ఈ సినిమాను శంకర్ ఎక్కడ తగ్గకుండా చాలా గ్రాండ్ గా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన ట్రైలర్ ను చూస్తే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంది.

    ఇక ఈ సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తుంటే ఈ సినిమాలో సిద్ధార్థ్ కీలకమైన పాత్రలో నటించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన పోషించిన పాత్ర ఈ సినిమాకి దిశ నిర్దేశాన్ని సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తను చివర్లో చనిపోతాడనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఆయన ఎందుకు చనిపోతాడు అంటే ఆయన చేసే ఒక పని ద్వారా ఆయనకు తెలియకుండానే ఆయన బ్యాకెండ్ లో చాలా దారుణమైన పరిస్థితిలు అయితే జరుగుతాయట.

    Also Read: Bharateeyudu 2: భారతీయుడు 2 కోసం కమలహాసన్ అంత కష్టపడ్డడా..? లోక నాయకుడు అంటే ఊరికే అయిపోరూ కదా..

    ఇక దాన్ని చూడలేక ఆయన సూసైడ్ చేసుకొని చనిపోతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ట్రైలర్ లో దానికి సంబంధించిన షాట్స్ ఏవి రివిల్ చేయనప్పటికీ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సిద్ధార్థ్ చనిపోతారట. ఇక దాంతో సేనాపతి అసలు ఈ సినిమాకి ఎండింగ్ ఎలా ఇవ్వబోతున్నారు అనేదే ఇక్కడ కీలకంగా మారనుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఒకప్పటి సేనాపతి మరోసారి తన ‘మర్మ కళ’ తో ప్రేక్షకులను మ్యాజిక్ చేయడానికి మన ముందుకు వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    Also Read: Game Changer: శంకర్ గేమ్ చేంజర్ కి లైన్ క్లియర్…టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే…

    ఇక మరో రెండు రోజుల్లో కల్కి సినిమాతో మనందరిని ఆకట్టుకోబోతున్న కమలహాసన్ వచ్చే నెల 12వ తేదీన భారతీయుడు 2 తో మరోసారి మనల్ని మెప్పించడానికి రెడీ అవుతున్నాడు… ఇక విక్రమ్ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను అయితే సాధించాడో మరోసారి ఈ రెండు సినిమాలతో మంచి సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు…