https://oktelugu.com/

Game Changer: శంకర్ గేమ్ చేంజర్ కి లైన్ క్లియర్…టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే…

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయాలని శంకర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక జూలై 12వ తేదీన భారతీయుడు 2 సినిమా రిలీజ్ రోజే గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసి అదే రోజు ఆ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 26, 2024 / 09:55 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer: ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడి గా పేరు పొందిన శంకర్ ఎట్టకేలకు భారతీయుడు 2 సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. వచ్చేనెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇక ఈ సినిమా మీద భారీ ప్రమోషన్స్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎట్టకేలకు రామ్ చరణ్ తో చేస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాకు సంబంధించిన లైన్ అయితే క్లియర్ అయినట్టుగా కనిపిస్తుంది.

    అయితే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేయాలని శంకర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక జూలై 12వ తేదీన భారతీయుడు 2 సినిమా రిలీజ్ రోజే గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసి అదే రోజు ఆ సినిమా రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒకేసారి ఒక సినిమా నడుస్తున్న సమయంలో మరొక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా శంకర్ స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

    ఇక 12వ తేదీ అనేది శంకర్ కి మంచి రోజుగా మారబోతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే రోబో సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని శంకర్ ఈ సినిమాతో కనక సరైన సక్సెస్ కొట్టకపోతే మాత్రం ఆయనకి పెద్ద హీరోల నుంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లైతే లేవు. కాబట్టి ఇప్పటికైనా తను చేస్తున్న ఈ రెండు సినిమాలతో సక్సెస్ ని సాధిస్తేనే ఆయనకు మార్కెట్ పరంగా అయిన క్రేజ్ పరంగా అయిన చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.

    ఇక లేకపోతే మాత్రం ఆయన కూడా ఫేడ్ ఔట్ డైరెక్టర్ల లానే మిగిలిపోవాల్సి వస్తుంది. భారతీయుడు 2 సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా ఆ ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. కాబట్టి అది కూడా అతనికి ఒక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు…