Mahesh Babu: మహేష్ బాబు హిట్ అవ్వాల్సిన ఆ రెండు సినిమాలు చేయకుండా వదిలేసి తప్పు చేశాడా..?

మహేష్ బాబు కి సుకుమార్ చెప్పిన కథ పుష్ప సినిమా కథ నే అని అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. నిజానికి పుష్ప కథ ముందుగా మహేష్ బాబుకి చెప్పి మహేష్ బాబుతో చేయాలని ఉద్దేశ్యం తో సుకుమార్ ఉన్నట్టుగా అప్పట్లో పలు కథనాలు వచ్చాయి .

Written By: Gopi, Updated On : January 14, 2024 12:11 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: మహేష్ బాబు రాజకుమారుడు అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.ఇక తండ్రి కి తగ్గ తనయుడి గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన కృష్ణవంశీ తో చేసిన మురారి సినిమాతో తనకి మొదటి కమర్షియల్ సక్సెస్ దక్కింది. ఇక దాంతో గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఒక్కడు సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకొని మాస్ హీరోగా మంచి అవతారం ఎత్తాడు.

ఇక ఆ తర్వాత అతడు, పోకిరి, దూకుడు లాంటి వరుస సక్సెస్ లను అందుకుంటూ వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు రెండు సూపర్ డూపర్ సక్సెస్ లను సాదించిన సినిమాలను మిస్ చేసుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో ఇంతకు ముందు 1 నేనొక్కడినే అనే సినిమా చేసిన మహేష్ బాబు ఆ సినిమాతో భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత రంగస్థలం లాంటి ఒక సూపర్ సక్సెస్ సినిమా తర్వాత మహేష్ బాబు సుకుమార్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. అందులో భాగంగానే ఆయన చెప్పిన కథ కూడా మహేష్ బాబు కి నచ్చింది సినిమా చేస్తానని ఓకే అన్నాడు.కానీ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ మళ్ళీ ఆ కథ నుంచి క్విట్ అయిపోయాడు.

ఇక మహేష్ బాబు కి సుకుమార్ చెప్పిన కథ పుష్ప సినిమా కథ నే అని అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. నిజానికి పుష్ప కథ ముందుగా మహేష్ బాబుకి చెప్పి మహేష్ బాబుతో చేయాలని ఉద్దేశ్యం తో సుకుమార్ ఉన్నట్టుగా అప్పట్లో పలు కథనాలు వచ్చాయి కానీ అది సెట్ కాకపోవడం తో ఆ సినిమాని సుకుమార్ అల్లు అర్జున్ తో చేసి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇలా మహేష్ బాబు ఒక పాన్ ఇండియా సినిమాని మిస్ అయ్యాడు అనే చెప్పాలి. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో వచ్చిన అనిమల్ సినిమా స్టోరీ కూడా ముందుగా మహేష్ బాబు కి చెప్పాడు.

ఈ సినిమా కూడా మహేష్ బాబు చేయాల్సింది కానీ చివరి నిమిషంలో మిస్సయింది. ఇక ఈ సినిమా కూడా రీసెంట్ గా రిలీజ్ అయి 900 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టి పాన్ ఇండియా ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చాటుకుంది. ఇలా పాన్ ఇండియా సినిమాలు రెండింటిని మిస్ చేసుకొని మహేష్ బాబు చాలా పెద్ద తప్పు చేశాడంటు అతని అభిమానులు ఇప్పటికి కూడా బాధపడుతుంటారు…