Aditya 999: హనుమాన్ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే ఆ, కల్కి, జాంబిరెడ్డి లాంటి సినిమాలను తెరకేక్కించాడు.ఇక ఇప్పుడు హనుమాన్ తో సూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్ గా కూడా ఎదిగాడు అలాగే ఒక సినిమాని తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ ఫుట్ వచ్చే విధంగా ఎలా తీయొచ్చు అని ఒక టెక్నిక్ కూడా ఆయనకు చాలా బాగా తెలుసు కాబట్టే ఆయన ఈ సినిమా చేయగలిగాడు అంటూ ఆయన మీద ఇప్పుడు ప్రశంసల వర్షం అయితే కురుస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు చాలా రోజుల నుంచి ఆదిత్య 999 సినిమాని తెరకక్కించాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మొదట సంగీత శ్రీనివాసరావు ని డైరెక్టర్ గా తీసుకుందాం అనుకున్నప్పటికీ ఆయనకి ఏజ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయన సినిమా మొత్తాన్ని డైరెక్షన్ చేసే కెపాసిటీ లేకపోవడం వల్ల బాలయ్య బాబు ఆ సినిమాని హోల్డ్ లో పెడుతూ వస్తున్నారు. ఇక ఆ స్క్రిప్ట్ ని తెరకెక్కించగలిగే సత్తా ఉన్న దర్శకుడు దొరకకపోవడంతో దాన్ని ఇప్పటివరకు పక్కన పెట్టేశారు. ఇక ఎప్పుడు హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
కాబట్టి ఆల్రెడీ బాలయ్య ప్రశాంత్ వర్మ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు బాలయ్య బాబు ఆదిత్య 999 సినిమాని ప్రశాంత్ వర్మతో తీయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఇది ఎంతవరకు నిజం అనే విషయం తెలీదు గానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఆదిత్య 999 సినిమాని అప్పగిస్తే చాలా బాగా హ్యాండిల్ చేయగలడు అని హనుమాన్ సినిమాను చూసిన చాలా మంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక బాలయ్య బాబు ప్రశాంత్ వర్మ తో ఎలాంటి సినిమాని చేయాలని అనుకుంటున్నారో తెలియదు కానీ ఆదిత్య 999 సినిమాని మాత్రం ప్రశాంత్ వర్మతో చేస్తే అది తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని పలువురు ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు…చూడాలి మరి వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో…