https://oktelugu.com/

Vakkantham Vamsi On NTR: వక్కంతం వంశీ కి ఎన్టీయార్ చేసిన అన్యాయం ఏంటో తెలుసా..?

ఎన్టీఆర్ కి మొదటి నుంచి కూడా రైటర్ వక్కంతం వంశీ మంచి స్నేహితుడు. ఇక మొదటగా వక్కంతం వంశీ దగ్గర ఒక మంచి స్టోరీని విన్న ఎన్టీఆర్ అప్పటికే సురేందర్ రెడ్డి తో సినిమా చేయాలని కమిట్ అయ్యాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 14, 2024 / 12:08 PM IST

    Vakkantham Vamsi On NTR

    Follow us on

    Vakkantham Vamsi On NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే నటన పరంగా స్టార్ హీరోలుగా గుర్తించబడుతున్నారు. ఇక ఈ జనరేషన్ లో ఉన్న హీరోలలో అలాంటి హీరో ఎన్టీయార్ ఒక్కడే అని చెప్పాలి. ఇక ఆయన ఏ సినిమా చేసిన కూడా అందులోని పాత్ర కి సరిగ్గా సరిపోతాడు. అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ లో ఎన్టీయార్ కనిపించకుండా పాత్ర మాత్రమే కనిపించేలా నటించి ప్రతి ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకుంటాడు.

    ఇక ఇలాంటి ఎన్టీఆర్ కి మొదటి నుంచి కూడా రైటర్ వక్కంతం వంశీ మంచి స్నేహితుడు. ఇక మొదటగా వక్కంతం వంశీ దగ్గర ఒక మంచి స్టోరీని విన్న ఎన్టీఆర్ అప్పటికే సురేందర్ రెడ్డి తో సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. దాంతో సురేందర్ రెడ్డి కి ఆ కథ వంశీ చేత చెప్పించి అదే కథతో అశోక్ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ మాత్రం విడిపోకుండా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే వస్తుంది.

    ఇక ఇలాంటి క్రమంలో ఎన్టీయార్ హీరో గా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఉసరవెల్లి సినిమాకి కూడా వక్కంతం వంశీ కథ అందించాడు. ఈ సినిమా కూడా యావరేజ్ గా ఆడింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత వంశీ ఒక మంచి కథను రెడీ చేసుకొని ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి తనే డైరెక్షన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు అయితే ఒక రోజు ఒక స్టోరీ ని ఎన్టీఆర్ కి కూడా వినిపించాడు. అయితే ఎన్టీఆర్ కూడా ఆ స్టోరీ విని సూపర్ గా ఉందని అతనితో చెప్పాడు. అయినప్పటికీ ఎన్టీఆర్ కి అప్పటికే వరుసగా 6 ప్లాపులు వచ్చాయి ఇక ఇలాంటి సమయం లోనే ఒకరోజు పూరి జగన్నాథ్ ని కలిసి ఆయనతో మాట్లాడిన ఎన్టీఆర్ మన కాంబినేషన్ లో ఒక సినిమా చేద్దామని ఆయనతో చెప్పాడు దానికి పూరి కూడా ఓకే అనడం తో సినిమా చేయడానికి ఇద్దరు ఫిక్సయ్యారు. ఇక దాంతో వక్కంతం వంశీ చెప్పిన కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చింది కాబట్టి ఆ కథకే పూరి జగన్నాధ్ ని డైరెక్షన్ చేయమన్నాడు దానికి పూరి మొదట ఒప్పుకోలేదు కానీ ఎన్టీయార్ మరి మరి చెప్పడం తో పూరి జగన్నాథ్ కాదనలేకపోయాడు.

    బేసిగ్గా పూరి తన సినిమాకి తనే కథ రాసుకుంటాడు వేరే వాళ్ళ కథ తీసుకోవడానికి అసలు ఇష్టపడడు. కానీ ఎన్టీఆర్ చెప్పాడనే ఒకే ఒక కారణం చేత వక్కంతం వంశీ ఇచ్చిన టెంపర్ కథతో సినిమా చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే వక్కంతం వంశీ టెంపర్ కథని తను డైరెక్షన్ చేద్దామనుకున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం వంశీని ఒప్పించి మన కాంబినేషన్ లో మరో కథ రెఢీ చేయి దాంతో సినిమా చేద్దాం అని చెప్పాడు. ఇక ఆ తర్వాత వక్కంతం వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కథని ఎన్టీఆర్ కోసం రాసుకున్నాడు కానీ ఆ కథ ఎన్టీఆర్ కి నచ్చకపోవడంతో ఆ సినిమాని అల్లు అర్జున్ తో చేశాడు ఆ సినిమా ఫ్లాప్ అయింది.

    నిజానికి టెంపర్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది కాబట్టి ఆ సినిమాతో వంశీ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయితే బాగుండేది కానీ మిస్ అయిందని ఇప్పటికి కూడా వంశీ చాలా ఫీల్ అయిపోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ అతనితో సినిమా చేస్తానని చెప్పి ఇప్పటివరకు కూడా అతని డైరెక్షన్ లో సినిమా చేయకుండా అతన్ని మోసం చేశాడనే చెప్పాలి…