Balakrishna And Chiranjeevi: చిరంజీవి, బాలకృష్ణ నిన్నటి తరం లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్..అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా అప్పట్లో మీరు చిరంజీవి అభిమానా?, లేకపోతే బాలకృష్ణ అభిమానా? అని అడిగేవారు. ఆ స్థాయిలో వీళ్లిద్దరి మేనియా నడిచింది. అయితే బాలకృష్ణ ఎక్కువగా మాస్ సినిమాలకే పరిమితం అవ్వడం, మధ్యలో కొన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ అవ్వడం, చిరంజీవి మాస్ సినిమాలతో పాటుగా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు తియ్యడం, ఫ్యామిలీ జానర్ ని కూడా టచ్ చేయడం తో ఆయనకీ కాస్త బాలయ్య కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. చిన్నపిల్లల్లో కూడా అప్పట్లో చిరంజీవి కి ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. ఆయన క్రేజ్ ని వాడుకుంటూ ఎన్నో ప్రొడక్ట్స్ ఓనర్లు యాడ్స్ కూడా చేయించుకున్నారు. అంతే కాదు చిరంజీవి అప్పట్లో తన మనసుకి నచ్చితే ఏ సినిమాకి అయినా బహిరంగంగా ప్రమోట్ చేసేవాడు.
అలా బాలయ్య సినిమాకి కూడా చేసాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే బాలకృష్ణ – సింగీతం శ్రీనివాస రావు కాంబినేషన్ లో అప్పట్లో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ అనే చిత్రం కమర్షియల్ గా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, ఆల్ టైం క్లాసిక్ గా కూడా నిల్చింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాని మనం టీవీ లో ప్రసరమైనప్పుడు పనులు మానుకొని చూస్తుంటాము. అయితే అప్పటి కాలానికి ఈ సినిమా చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. కమర్షియల్ సినిమాలకు బాగా అలవాటు పడిన జనాలకు ఇలాంటి సినిమాలు నచ్చుతాయో, నచ్చవో అనే భయం ఉండేది. అందుకే ఈ సినిమా మీద జనాల్లో అవగాహన పెంచేందుకు అప్పట్లో దూరదర్శన్ ఛానల్ లో సినీ సెలబ్రిటీస్ చేత మూవీ టీం ప్రత్యేకంగా యాడ్స్ చేయించింది. ముఖ్యంగా చిరంజీవి కి అన్ని వర్గాలలో విపరీతమైన క్రేజ్ ఉన్నందున, అతనిని ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఉపయోగించుకోవాలని అనుకుంది మూవీ టీం. చిరంజీవిని రిక్వెస్ట్ చేయగా ఆయన వెంటనే ఒప్పుకొని ఈ సినిమా కోసం యాడ్స్ చేసాడు. అప్పట్లో ఈ యాడ్స్ ని తెగ వాడుకునేవారు మూవీ టీం. అలా బాలయ్య లాంటి సూపర్ స్టార్ కూడా చిరంజీవి క్రేజ్ ని ఉపయోగించుకున్నాడంటే అప్పటి పరిస్థితులు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉండేవో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈమధ్య వీళ్లిద్దరికీ పడట్లేదని, ఒకరి మీద ఒకరు పరోక్షంగా సెటైర్లు వేసుకుంటున్నారని సోషల్ మీడియా లో అనేక రకాల కథనాలు వచ్చాయి. కానీ రీసెంట్ గానే బాలయ్య బాబు కి హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకలను తెలుగు సినీ పరిశ్రమ ఘనంగా చేసింది. ఈ వేడుకల్లో చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొని బాలకృష్ణని పొగడ్తలతో ముంచి ఎత్తాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఎలాంటి కోల్డ్ వార్ జరగడం లేదని క్లారిటీ వచ్చింది. త్వరలో బాలయ్య బాబు చేయబోతున్న అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 3 కి మెగాస్టార్ ముఖ్య అతిథిగా విచేయబోతున్నారని టాక్.