https://oktelugu.com/

Maruti Grand Vitara 7 Seater : మారుతి నుంచి కొత్త 7 సీటర్ కారు.. ఆ కార్లకు ఇక గట్టి పోటీ..

మారుతి గ్రాండ్ విటారా 7 సీటర్ వినియోగదారులకు అనుగుణంగా సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. ఇందులో గురు కన్వినెంట్ గా ప్రయాణించవచ్చు. కొత్త గ్రాండ్ విటారాలో అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటికే మార్కెట్లోక ఉన్న గ్రాండ్ విటారా 5 సీటర్ల ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 4, 2024 / 05:58 PM IST
    Maruthi 7 seater Grand vitara

    Maruthi 7 seater Grand vitara

    Follow us on

    Maruti Grand Vitara 7 Seater : దేశంంలో మారుతి కార్లకు అత్యంత ప్రాధాన్యత ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని రకాల మోడళ్లను పరిచయం చేసే ఈ కంపెనీ ఎప్పటి కప్పుడు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతోంది. కొత్త టెక్నాలజీతో పాటు సీటింగ్ సంఖ్యను పెంచి వినియోగదారులను ఆకర్షిస్తోంది. తాజాగా ఈ కంపెనీ7 సీటర్ కారను పరిచయం చేసింది. అయితే ఈ 7 సీటర్ కొత్తకారమే కాదు. ఇప్పటికే ఉన్న గ్రాండ్ విటారా 5 సీటర్ ను 7 సీటర్ గా మార్చారు. మారుతి గ్రాండ్ విటారా ఎస్ యూవీ వేరియంట్ లో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఈ మోడల్ కు మార్కెట్లో మంచి పేరు ఉంది. ఈ తరుణంలో ఈ మోడల్ 7 సీటర్ తో మళ్లీ రాబోతుండడంతో దీని ఫీచర్స్ ఎలా ఉండనున్నాయోనని కారు కొనుగోలు దారుల్లో ఆసక్తి నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఇప్పుడంతా 7 సీటర్ల హవా నడుస్తోంది. కార్యాలయ అవసరాలతో పాటు లాంగ్ ట్రిప్ చేయడానికి 7 సీటర్ కారు ఎంతో అనువుగా ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన 7 సీటర్ల కార్ల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో మారుతి కంపెనీ గ్రాండ్ విటారాను 7 సీటర్ తో పరిచయం చేస్తుంది. మారుతి కొత్త గ్రాండ్ విటారాలో రెండు ఇంజిన్లు ఉండనున్నాయి. వీటిలో ఒకటి 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ తో పాటు 1.5 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 103 పీఎస్ పవర్ వద్ద 107 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చరేస్తుంది. రెండో ఇంజిన్ 1156 పీఎస్ పవర్, 122 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంది.

    మారుతి గ్రాండ్ విటారా 7 సీటర్ వినియోగదారులకు అనుగుణంగా సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. ఇందులో గురు కన్వినెంట్ గా ప్రయాణించవచ్చు. కొత్త గ్రాండ్ విటారాలో అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పటికే మార్కెట్లోక ఉన్న గ్రాండ్ విటారా 5 సీటర్ల ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. ఇక ఈ మోడల్ లీటర్ కు 27.97 కిలోమీటర్ల మైలేజ్ ను ఇచ్చే అవకావం ఉంది. ఇప్పటికే ఉన్న గ్రాండ్ విటారా కూడా ఇంతే మైలేజ్ ను ఇస్తుంది. మార్కెట్లో ఉన్న 7 సీటర్ కార్లు టాటా సఫారీ, ఎంజీ హెక్టార్ ప్లస్, మహీంద్రా ఎక్స్ యూవీ 700 కార్లకు కొత్త మారుతి కారు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు.

    వినియోగదారులు ఎక్కువగా 7 సీటర్ కోరుకుంటున్న నేపథ్యంలో మారుతి ఈ సరికొత్త ప్రయోగం ఫలించే అవకాశం ఉందని అంటున్నారు.అలాగే ఇప్పటికే మారుతి నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎర్టీగా మంచి ఆదరణ పొందింది. అయితే ఈ కారు తప్ప మరో 7 సీటర్ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న గ్రాండ్ విటారా ను 7 సీటర్ గా మార్చి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తోంది.