https://oktelugu.com/

Balakrishna: కన్నప్ప కోసం రంగంలోకి దిగుతున్న బాలయ్య…ఏం చెయ్యబోతున్నాడో తెలుసా..?

మోహన్ బాబు కొడుకులు అయిన విష్ణు మనోజ్ లు ఎన్ని సినిమాలు చేసిన కూడా ఏ ఒక్క సినిమా కలిసి రావడం లేదు. ఇక నిన్న కాక మొన్న వచ్చిన యంగ్ హీరోలు సైతం వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఇద్దరికీ చెరొక హిట్టు తప్ప అంతకుమించి సక్సెసులైతే దక్కలేదు...

Written By:
  • Gopi
  • , Updated On : September 4, 2024 / 05:40 PM IST

    Balakrishna

    Follow us on

    Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు…ఇక కెరియర్ మొదట్లో విలన్ పాత్రలు చేసిన ఈయన ఆ తర్వాత కామెడీ విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషించి తనకంటూ ఒక మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నిజానికి మోహన్ బాబు ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా చేసేస్తాడు. అలాగే తన డైలాగ్ డిక్షన్ కూడా చాలా ఫేయిర్ గా ఉండడంతో మోహన్ బాబు లాంటి నటులను వాడుకోవడంలో దర్శకులు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇక ఇలాంటి క్రమంలోనే తన నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అయినప్పటికీ విష్ణు మాత్రం ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకుల్ని అలరించడంతో పాటుగా ఈ సినిమాలో ఉన్న చాలామంది నటీనటులను భాగం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఇండియాలో ఉన్న టాప్ స్టార్లలందరినీ ఈ సినిమాలో భాగం చేయాలని చూస్తున్నాడు. ఇక దానికోసమే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి దిగ్గజ నటులను ఈ సినిమాలో భాగం చేశారు.

    ఇక ఇదిలా ఉంటే తెలుగులో స్టార్ హీరో అయిన బాలయ్య బాబును కూడా ఈ సినిమాలో భాగం చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. బాలయ్య బాబు ఈ సినిమాలో ఒక చిన్న క్యామియో రోల్ పోషించబోతున్నాడా లేదంటే ఒక పాత్రలో కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

    ఇక రీసెంట్ గా బాలయ్య బాబు 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకను జరుపుకున్న నేపథ్యంలో ఆ ఈవెంట్ కి హాజరైన మోహన్ బాబు, విష్ణు బాలయ్య బాబుతో మంతనాలు జరిపి అతన్ని ఆ పాత్ర కోసం ఎంపిక చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇంతకుముందు మనోజ్ హీరోగా వచ్చిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలో కూడా బాలయ్య బాబు ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించాడు.

    అయితే ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించనప్పటికీ ఆ పాత్రకు మాత్రం చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది… ఇక ఇదంతా చూస్తుంటే కన్నప్ప సినిమా కోసం బాలయ్య బాబును రంగంలోకి దింపడం లో విష్ణు సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన పోషించే పాత్ర ఏంటి సినిమాతో సంబంధం ఉంటుందా లేదంటే జస్ట్ చిన్న క్యామియో రోల్ లో వచ్చి వెళ్ళిపోతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది…