Balakrishna And Nagarjuna: నాగార్జున చేయాల్సిన సినిమాను బాలయ్య చేశాడా..? ఇంతకీ ఆ సినిమా ఏంటి..? హిట్ అయిందా? ప్లాప్ అయిందా..?

సినిమా మీద ఇష్టం, ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఒకసారి అవకాశం అయితే దొరుకుతుంది. అలాగే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని ముందుకు సాగే ప్రక్రియలో వాళ్ళు సక్సెస్ ను కూడా సాధిస్తారు...

Written By: Gopi, Updated On : October 5, 2024 10:31 am

Balakrishna And Nagarjuna

Follow us on

Balakrishna And Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి ఇప్పుడున్న అఖిల్ వరకు ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో సపరేట్ స్థానం అయితే ఉంది. మరి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ సాధించినప్పటికి నాగార్జున చేయాల్సిన ఒక సినిమా బాలయ్య బాబు చేసి సూపర్ హిట్ సంపాదించుకున్నాడు. నిజానికి నాగార్జున ఆ సినిమా చేయాలనుకున్నాడు. అయినప్పటికీ తను అనుకొని కారణాలవల్ల బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడు. ఇక ఆ మొత్తానికైతే బాలయ్య బాబు ఆ సినిమా చేసి సూపర్ సక్సెస్ ను అందుకొని తనలోని నటన ప్రతిభను బయటకు తీసి సినిమాని సూపర్ సక్సెస్ గా నిలిపాడు. ఇక ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ‘ఆదిత్య 369’…ఇక సింగీతం శ్రీనివాసరావు మొదట ఈ కథని నాగార్జునకి నాగేశ్వరరావుకి వినిపించారట. బావుంది నేను చేస్తానని నాగార్జున చెప్పినప్పటికీ ఆయన అప్పుడు ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం దానివల్ల ఆ సినిమా లేట్ అవుతూ ఉండటం వల్ల సింగీతం శ్రీనివాసరావు కి వెయిట్ చేసే ఓపిక లేకపోవడంతో బాలయ్య బాబుతో ఈ సినిమా చేశాడు.

ఇక మొత్తానికైతే సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా బాలయ్య బాబు కెరియర్ లోనే ఒక క్లాసికల్ మూవీ గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తు ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. మరి మొత్తానికైతే బాలయ్య బాబు సాధించిన విజయాల్లో ఈ సినిమా అత్యంత కీలకమైన సక్సెస్ అనే చెప్పాలి.

ఆయన టాప్ టెన్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా గొప్ప సినిమాను పరిచయం చేసి చూపించిందనే చెప్పాలి. మరి ఇలాంటి సినిమాలు చేయడం అనేది బాలయ్య బాబుకే సాధ్యమవుతుంది అంటూ అప్పట్లో చాలామంది బాలయ్య మీద పొగడ్తల వర్షం కురిపించిన విషయం కూడా మనకు తెలిసిందే.

ఇక మొత్తానికైతే బాలయ్య తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సెట్ చేసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం.. ఇక ఇప్పటికీ వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం మాస్ కమర్షియల్ సినిమాల వెంటపడుతున్న బాలయ్య ప్రయోగాత్మకమైన కథలు తన దగ్గరికి వస్తే ఆ సినిమాలు చేయడానికి కూడా తను ఆసక్తిగా ఉన్నట్టుగా పలు సందర్భాల్లో తెలియజేశాడు…