Software Engineer Murder Case : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య కేసులో ఊహించని మలుపు.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజం వెలుగులోకి..

హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబిఆర్ ఎస్టేట్ లో గత సోమవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారించిన పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 5, 2024 10:37 am

Software Engineer Murder Case

Follow us on

Software Engineer Murder Case :  సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య కేసులో ఊహించని మలుపు ఎదురయింది. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు సరికొత్త విషయాలను వెల్లడించారు. ఆ ఉద్యోగినిని తోటి స్నేహితుడు, క్లాస్ మేట్ హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిబిఆర్ ఎస్టేట్ లో గత సోమవారం ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని(29) ఓ కంపెనీలో పని చేస్తోంది.. ఆమె ఇంటర్ చదువుతున్నప్పుడు వినయ్ కుమార్ అనే యువకుడిని ప్రేమించింది.. అతడిని 2022లో పెళ్లి చేసుకుంది. వినయ్ కుమార్ ఒక ప్రముఖ చికెన్ తయారీ సంస్థలు చీఫ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఆ ఉద్యోగిని, వినయ్ కుమార్ మధ్య విభేదాలు మొదలయ్యాయి.. దీంతో అతడు వేధిస్తున్నాడని 2023 లో ఆ ఉద్యోగిని మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ ఉపయోగం లేకుండా పోవడంతో.. విడాకులకు కోర్టులో దరఖాస్తు చేశారు. ఇక ఆ ఉద్యోగిని కుటుంబ సభ్యులతో కలిసి సిబిఆర్ ఎస్టేట్ లో నివాసం ఉంటోంది. ఆమె తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. సోమవారం ఆమె వీధులకు వెళ్ళింది. ఈ క్రమంలో మధ్యాహ్నం సోదరి ఇంటికి వచ్చి తలుపు కొట్టగా తీయలేదు. సాయంత్రం వచ్చి తల్లి తలుపు కొట్టినా తీయలేదు. అనుమానం వచ్చి ఫోన్ చేసినా తీయలేదు. దీంతో స్థానికులు సహాయంతో తలుపు బద్దలు కొట్టి ఇంట్లో చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె చనిపోయింది. దీంతో ఈ దారుణానికి వినయ్ కుమార్ పాల్పడి ఉంటాడని వారు అనుమానం వ్యక్తం చేయడంతో.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారిదైన శైలిలో విచారించారు. అయితే అతడు ఆమెను చంపలేదని నిర్ధారించుకొని వదిలిపెట్టారు.

ఆ ఆధారాలతో..

వినయ్ కుమార్ చంపకపోవడంతో పోలీసులకు ఈ కేస్ సవాల్ గా మారింది. దీంతో ఎస్ఓటి, మియాపూర్ పోలీసులు సిసిటీవీ పుటిజి పరిశీలించారు. కాల్ డేటా ను తనిఖీ చేశారు.. ఈ క్రమంలో ఓ అపార్ట్మెంట్ సమీపంలో హత్య చేసేందుకు వినియోగించిన స్క్రూ డ్రైవర్, రక్తాన్ని తోడిచేందుకు ఉపయోగించిన దుస్తులను పడేసినట్టు పోలీసులు గుర్తించారు.. అయితే సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితుడిని గుర్తించారు. రహస్య ప్రాంతంలో అతడిని విచారిస్తున్నారు. అయితే ఈ హత్యకు పాల్పడింది మనోజ్ కుమార్ యాదవ్ అని తెలుస్తోంది.. భర్తతో విడిపోయిన తర్వాత ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.. తన క్లాస్మేట్, స్నేహితుడైన మనోజ్ కుమార్ యాదవ్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇతరులతోను ఆమె క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు మనోజ్ కుమార్ గుర్తించాడు. దీంతో ఈ పద్ధతి కాదని ఆమెను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె పద్ధతి మార్చుకోకపోవడంతో కక్షపెంచుకున్నాడు. ఆమెను అంతమందించాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం ఒంటరిగా ఉండడంతో ఆమె ఇంటికి వెళ్ళాడు. ఈ సమయంలో ఇద్దరు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అతడు ఆమెను విచక్షణారహితంగా కొట్టాడు. స్క్రూ డ్రైవర్ తో పొడిచి హత్య చేశాడు. అయితే ఘటనా స్థలంలో మృతురాలి రెండు దవడ పళ్ళను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.