Dhurandhar 2 25 Days Worldwide Collections: ఉగాది , రంజాన్ కానుకగా విడుదలైన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకు వెళ్తోంది. మొదటి 11 రోజుల తర్వాత ఈ సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి అనే విషయం వాస్తవమే. ‘ధురంధర్’ రన్ తో పోలిస్తే ‘ధురంధర్ 2’ రన్ పనికిరాదని చెప్పాలి. ‘ధురంధర్’ రేంజ్ థియేట్రికల్ రన్ ‘ధురంధర్ 2’ కి వచ్చి ఉండుంటే , ఈపాటికి ఆ చిత్రం 2500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను దాటి ఉండేది. కానీ ఇప్పుడు 1800 కోట్ల గ్రాస్ మార్కుని దాటడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ని చూస్తుంటే, ఈ సినిమా ‘బాహుబలి 2’ ఫుల్ రన్ గ్రాస్ ని అందుకోవడం అసాధ్యమని అనిపిస్తోంది అంటూ ట్రేడ్ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
25 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి , 25 రోజున ఇండియా వైడ్ గా 14 కోట్ల 35 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 17 కోట్ల 50 లక్షల రూపాయిల వరకు ఉంటుంది. అదే విధంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి 25 వ రోజున 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 25 వ రోజున 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 25 రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 1712 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 1297 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 1083 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఓవర్సీస్ నుండి 415 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఇప్పటి వరకు నమోదు అయ్యాయి. అయితే కొంతమంది ఈ చిత్రానికి 1758 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. మరి కొంతమంది ఈ సినిమా అంటే ఇష్టం లేని వాళ్ళు 1625 కోట్ల రూపాయిలు మాత్రమే ఇప్పటి వరకు ఈ చిత్రం రాబట్టింది అంటున్నారు. అందులో మన టాలీవుడ్ లోని కొన్ని సైట్స్ కావాలని ఉద్దేశపూర్వకంగా ‘పుష్ప 2’ , ‘బాహుబలి 2’ లను దాటడం ఇష్టం లేక అలా చేస్తున్నారు. అయితే ఒరిజినల్ లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 1800 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రం కచ్చితంగా వస్తుందని , కానీ బాహుబలి 2 ని దాటడం మాత్రం ప్రస్తుతానికి కష్టమే అని అంటున్నారు. ఈ వీకెండ్ నమోదు అయ్యే వసూళ్లతో , ఈ చిత్రం బాహుబలి 2 ని దాటుతుందా లేదా అనేది తెలియనుంది.