Master Bharath: బాలనటుడిగా చిన్నతనం నుండి కామెడీ సన్నివేశాల్లో అద్భుతంగా రాణించి మన అందరిని కడుపుబ్బా నవ్వించిన నటుడు మాస్టర్ భరత్..ఇతను శ్రీను వైట్ల కి బంధువు అవుతాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..వెంకీ, ఢీ, రెడీ, దూకుడు ఇలా ఒక్కటా రెండా చిన్నప్పుడు ఈయన కామెడీ చేసాడంటే పొట్ట చెక్కలవ్వాసిందే..బాలనటుడిగా సుమారు 70 సినిమాలకు పైగా నటించిన భరత్..పెద్దయ్యాక పలు సినిమాల్లో నటించాడు..లావుగా బొద్దుగా కనిపించే భరత్ ఇప్పుడు సన్నగా మారిన అవతారం లో చూసి ప్రతి ఒక్కరు షాక్ కి గురి అయ్యారు..అయితే చిన్నతనం లో ఈయనకి ఉన్నటువంటి డిమాండ్..పెద్దయ్యాక లేదు అనే చెప్పాలి..అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ బాల్యం లో ఈయనకి వచినటువంటి గుర్తింపు పెద్దయ్యాక రాలేదు..ఈయన చివరి సారిగా వెండితెర మీద కనిపించిన సినిమా FCUK : ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్..ఆ తర్వాత ఈయన మరో సినిమాలో నటించలేదు..కరోనా పీరియడ్ లో సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు అనే చెప్పాలి.

ఆయన సినిమాలు చేసే సంఖ్య తగ్గించడానికి కూడా ఒక్క కారణం ఉందట..భరత్ ఒక్క పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క డాక్టర్ కోర్స్ ని చదువుతున్నాడు..ఇటీవలే ఆయన డాక్టర్ కోర్స్ ని కూడా పూర్తి చేసాడట..వైద్య వృత్తి లో బాగా బిజీ అవ్వడం వల్లే ఆయన సినిమాలకు దూరం అయ్యాడని తెలుస్తుంది..అయితే ఇటీవలే మాస్టర్ భరత్ తన జీవితం లో ఎదురుకున్న కొన్ని సమస్యల గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నాడు.
Also Read: TikTok Fame Durga Rao: బిగ్ బాస్ కు షాకిచ్చిన దుర్గారావు.. అసలేం జరిగింది?

ఆయన చెన్నై లో చదువుకుంటున్న రోజుల్లో ఒక్క భారీ యాక్సిడెంట్ కి గురైయ్యాడట..ఈ యాక్సిడెంట్ జరిగిన సమయం లోనే లావుగా ఉండే భారత్ బాగా సన్నగా అయిపోయాడట..అయితే కొంత కాలం క్రితం ఆయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయం లో కళ్ళలోకి రాడ్ గుచ్చుకోవడంతో కంటి లో బ్లాక్ ఏర్పడింది అట..దీనికి ఎన్నో రకమైన మందులు వాడుతున్న కూడా ఎలాంటి మార్పులు కనిపించలేదట..ఈ సమస్య తో మాస్టర్ భరత్ చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది..ఇలాంటి సమస్యల వల్లే ఆయన సినిమాలకు దూరం అయ్యాడట.
Also Read:Celebrities Controversial Comments: నోటి దురుసుతనమే కొంపముంచిందా
[…] […]